స్కూలుకు స్కూటర్‌పై వెళ్తున్నాడు.. జనాలు వింతగా చూస్తున్నారు.. ఎందుకంటే?

స్కూలుకు స్కూటర్‌పై వెళ్తే తప్పేముంది.దానికి అతగాడిని వింతగా చూడటం దేనికి? అని అనుకుంటున్నారు కదూ.అవును, అక్కడే వుంది.అసలు విషయమంతా.

 He Is Going To School On A Scooter People Are Looking At Him Strangely Because ,-TeluguStop.com

ఓ యువకుడు రోడ్లపై రయ్యిరయ్యిన దూసుకెళ్తున్నాడు.అయితే అతగాడు డ్రైవ్ చేసుకుంటూ పోతున్నది మామ్మూలు స్కూటర్ కాదు.

ఓ బుల్లి స్కూటర్‌పై స్కూలుకి వెళ్తూ.హైదరాబాద్‌ నగర వీధుల్లో ఓ యువకుడు అందరినీ ఆకట్టుకున్నాడు.

అది చూడటానికి చిన్న పిల్లలు ఆడుకునేలాంటి ఓ చిన్ని స్కూటర్‌ లాగా వుంది.దాంతో ఆ యువకుడిని చూసి అంతా షాకవుతున్నారు.

ఈ దృశ్యం చూస్తే ఎవరో పిల్లాడు ఆడుకుంటూ రోడ్డుమీదకు వచ్చేశాడా అని కూడా అనిపిస్తోంది.కానీ అతను తన చిన్న సైజు స్కూటర్‌పై రోజూ 30 కి.మీ ప్రయాణిస్తూ కళాశాలకు వెళ్తున్నాడు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

వివరాల్లోకి వెళితే, అత్తాపూర్‌కు చెందిన ఓ యువకుడు ఒక చిన్ని ఈ స్కూటర్‌ పైన వెళ్తూ మెహదీపట్నం రోడ్డులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.ఈ చిన్ని స్కూటర్‌పై ఎక్కడికి వెళ్తున్నావని అతన్ని కొందరు అడిగారు.

అందుకు ఆ యువకుడు సమాధానం చెబుతూ.తాను వెళ్తున్న వాహనం ఒక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అని, దానిని పటాన్‌చెరులో మాన్యుఫ్యాక్చరింగ్‌ చేస్తున్నారని చెప్పాడు.

దానిని 4 గంటలు ఛార్జింగ్‌ చేస్తే 50 కిలో మీటర్ల వరకూ ప్రయాణించవచ్చని చెబుతున్నాడు.అయితే.తాను ప్రతిరోజూ అత్తాపూర్‌ నుంచి పంజాగుట్టకు ఈ చిన్ని స్కూటర్‌పైనే వస్తుంటానని చెప్పుకొచ్చాడు.దానిపై ప్రయాణం చాలా హాయిగా ఉందని పేర్కొన్నాడు.

ఈ చిన్న వాహనంపై ట్రాఫిక్‌లో కూడా ఈజీగా వెళ్లిపోగలుగుతున్నానని.తనకు పెద్దగా ట్రాఫిక్ కష్టాలు కూడా పెద్దగా ఎదురుకావడం లేదని బదులిచ్చాయి.

ఈ విషయం విన్న ప్రయాణికులు అతగాడికి మెచ్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube