మనిషి ఉన్నచోటనే ఎదగడానికి నానాయాతన పడుతూ ఉంటాడు.అవకాశాలు లేవని, ఎవరినీ నమ్మలేమని, డబ్బులు లేవని, సాయం చేసేవారు లేరని.
ఇలా అనేకరకాల భయాలతో మనిషి బాధపడుతూ వర్తమానాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటాడు.అలాంటిది ఆ వ్యక్తి దేశం కాని దేశంలో మన ప్రాంతీయ పానీయం అయినటువంటి చాయ్ ని అక్కడ పరిచయం చేసి, చదువుతున్న చదువుల్ని పక్కనబెట్టి వ్యాపారం చేసి దాన్ని విస్తరించగా నేడు అతడు కోటీశ్వరుడిగా ఎదిగాడు.
అతను మరెవ్వరో కాదు.మన నెల్లూరు కుర్రాడే.పేరు ఆ మహా నగరంలో ఎపుడూ రద్దీగా ఉండే CBD (సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్) ప్రాంతంలోని ఎలిజబెత్ స్ట్రీట్‌లో భారతీయులు, ఆస్ట్రేలియా వాసులు కలిసి ‘డ్రాప్‌అవుట్ చాయ్‌వాలా’ షాప్‌లో టీ షిప్ చేస్తూ, సమోసా తింటూ మనకు కనిపిస్తారు.‘డ్రాప్‌అవుట్ చాయ్‌వాలా’ పేరుతో ఫేమస్ అయిన చాయ్ వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది 22 ఏళ్ల కొండా సంజిత్.ఏడాదిలోనే రూ.5 కోట్ల టర్నోవరు సాధిస్తున్నానని సంజిత్ తాజాగా ఓ మీడియా ముఖంగా తెలిపారు.
ఈ సందర్భంగా సంజిత్ మాట్లాడుతూ… “BBA చదవడానికి ఇక్కడికి వచ్చాను.కాని కోర్సు పూర్తి చేయడంలో ఫెయిల్ అయ్యాను.దాంతో కాలేజీ డ్రాప్‌అవుట్‌గా మిగిలాను.సరిగ్గా అప్పుడే సొంత అంకురాన్ని పెట్టాలని ఐడియా వచ్చింది.చిన్నప్పటి నుంచీ నాకు టీ అంటే ఇష్టం.అందుకే ‘డ్రాప్‌అవుట్ చాయ్‌వాలా’కు అంకురార్పణ చేశాను.
టీ కొట్టు పెడతానన్నపుడు నా తల్లిదండ్రులు ఒకింత బాధపడ్డారు.అస్రార్ అనే ఒక ప్రవాసుడు నా ప్రాజెక్టుపై నమ్మకం ఉంచి.
ఏంజెల్ ఇన్వెస్టర్‌గా మారడానికి ఒప్పుకున్నారు.అలా నేడు ఇది ఈ స్థాయికి వచ్చింది.ఇపుడు నా తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతున్నారు.” అని చెప్పుకొచ్చాడు.