వైరల్ వీడియో: విమానంలోకి ఎంట్రీ ఇచ్చిన భారీ పాము.. చివరికి..?!

జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణం చేయాలనీ ప్రతి ఒక్కరు కలలు కంటారు.అప్పట్లో అయితే ఆకాశంలో విమానం కనిపిస్తే చాలు ఏదో వింత చూసినట్లు చూసేవాళ్ళము.

 He Huge Snake That Entered The Plane .finally Viral Video, Social Media, Viral L-TeluguStop.com

కానీ ఇప్పుడు డబ్బులు ఉండాలే గాని ఎక్కడికి వెళ్లాలన్నా విమానం ఎక్కేయొచ్చు మరి.మనుషులకు మల్లె ఓ పాముకి కూడా విమానంలో ప్రయాణం చేయాలనీ అనిపించిందో ఏమో ఏకంగా విమానంలోకి దూరిపోయింది.ఆ పామును చూస్తే ఎవరికన్నా గుండెల్లో దడ పుట్టాలిసిందే మరి.విమానంలోకి దూరిన పాము ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.ఈ ఘటన కోల్‌కతా విమానాశ్రయంలో చోటు చేసుకుంది.రాయపూర్ నుంచి వచ్చిన ఇండిగో విమానం కోల్‌కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయినది.అయితే కొద్ది సేపటి తరువాత ఇండిగో విమానం ప్రయాణానికి సిద్ధమయ్యింది.

ఈ క్రమంలో ఇండిగో విమానంలో ప్రయాణించే ప్రయాణీకుల లగేజీని విమానంలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు ఎయిర్ లైన్స్ సిబ్బంది.

అప్పుడే ఒక పెద్ద పాము రన్ వే మీద పాక్కుంటూ వెళ్లడం అక్కడి సిబ్బంది కంట పడింది.పామును చూసిన సిబ్బంది దాన్ని వెంటబడే క్రమంలో ఆ పాము చకచకామంటూ పాక్కుంటూ విమానంలోని లగేజ్ స్టాండ్ మీదకు ఎక్కేసి విమానం లోపలికి ప్రవేశించింది.

అక్కడ ఉన్న సిబ్బందిలో ఒకరు దైర్యం చేసి పాము తోకని పట్టుకున్నాడు.కానీ ఆ పాము మాత్రం అతనికి చిక్కలేదు.ఈ ఘటన జరిగే సమయానికి విమానంలోకి ప్రయాణికులు ఎవరు ఎక్కలేదు కాబట్టి ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు.

Telugu Snake, Indigo, Latest-Latest News - Telugu

విమానంలోకి వెళ్ళిన పాము గురించిన సమాచారమును ఎయిర్‌ లైన్స్ సిబ్బంది అటవీ శాఖకు అందచేయగా అటవీ శాఖ సిబ్బంది హుటాహుటిన ఎయిర్‌ పోర్ట్‌ కు చేరుకొని పామును వెతికేందుకు విమానంలోకి ఎక్కారు.అప్పటికే ఆ పాము విమానం లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్న బ్యాగేజ్ పెట్టుకునే స్థలంలోని ఒక కడ్డీకి చుట్టుకొని కనిపించింది.పామును చుసిన అటవీశాఖ అధికారులు దానిని పట్టుకొని విమానం నుంచి తీసుకెళ్లారు.

అయితే ఆ పాము అంత విషపూరితమైనది కాదని, దానిని రాటిల్ స్నేక్ అని పిలుస్తారని అటవీ అధికారులు వెల్లడించారు.పాము వలన ఇండిగో విమానంలో ప్రయాణం చేయవలిసిన ప్రయాణికులు వేరే విమానంలో ప్రయాణం చేసారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్‌ లో షేర్ చేయగా అది కాస్త నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube