కొడుకుని గాడిద అన్నందుకు ఊహించ‌ని ట్విస్టు ఇచ్చాడు.. ఏంటంటే

ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో పిల్లల పెంపకం కొంచెం డిఫరెంట్.మన దేశంలో అయితే పిల్లలను సక్రమదారిలో పెట్టేందుకుగాను పేరెంట్స్ వారిని కొడుతుంటారు లేదా కౌన్సెలింగ్ ఇస్తుంటారు.

 He Gave An Unexpected Twist To His Son Being An Ass .. That Is  Father, Son Twis-TeluguStop.com

ఆ పరిస్థితులను మనం పరిశీలించొచ్చు.అయితే, విదేశాల్లో ఇలా చేస్తే సీన్ వేరేలా ఉంటుంది.

విదేశాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలపై చేయి చేసుకున్న లేదా దూషించినా భారీ ఫైన్స్ కట్టడంతో పాటు కొన్ని సార్లు కటకటాల పాలైన సందర్భాలు ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్‌లో అయితే ఇంకా సెపరేట్ అండ్ స్ట్రిక్ట్ చట్టాలున్నాయి.

దీంతో ఆయా దేశాల్లో తల్లిదండ్రులు పిల్లలను అతి జాగ్రత్తగా పెంచుకుంటారు.అయితే, ఇలా చేయడం అన్ని సందర్భాల్లో సాధ్యపడకపోగా ఎప్పుడైనా పిల్లల పట్ల కొంచెం మొరటుగా ప్రవర్తిస్తే ఇక అంతే సంగతులు.

తాజాగా కువైట్‌లోని ఓ తండ్రి విషయంలో అదే జరిగింది.కొడుకును దూషించినందుకుగాను అక్కడి న్యాయస్థానం తండ్రికి భారీ ఫైన్ విధించింది.అయితే, తన తండ్రి తనను తిట్టాడని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు పిల్లాడి తండ్రిని విచారించారు.

Telugu Fine, Kuvite, Son, Son Gave Polic, Son Twist, Twist-Latest News - Telugu

ఈ క్రమంలోనే పోలీసుల వద్దకు వచ్చిన తండ్రి కోపంలో మరోసారి కుమారుడిని దూషించాడు.ఈ విషయం కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ వరకు చేరగా, న్యాయస్థానం 200 కువైటీ దినార్లు అనగా ఇండియన్ మనీ‌లో రూ.48 వేల ఫైన్ విధించింది.కాగా, కువైట్‌లో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

పిల్లలతో తప్పుగా మాట్లాడినందుకుగాను గతంలో ఓ తల్లి నెల రోజుల పాటు జైలుకు వెళ్లిన సందర్భం ఉంది.కువైట్ ప్రభుత్వం పిల్లల కోసం 2015లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది.

దాని ప్రకారం ఆ దేశంలో పిల్లలను తల్లిదండ్రులు దూషించడం, కొట్టడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube