కోతి పనులకు ఎవరైనా నవ్వుకుంటూనే ఉంటారు.ఎందుకంటే అవి చేసే పనులు అంత విచిత్రంగా ఉంటాయి.
వాటికి ఏం ఇస్తే ఏం చేస్తాయో ఎవరికీ తెలియదు.ఇప్పటికే మనం కోతులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడాన్ని చూస్తూనే ఉన్నాం.
మొన్నటికి మొన్న ఓ కోతి చిన్నారి దగ్గరకు వచ్చి ఆమె చేతిలో ఉన్న ఫోన్ను తీసుకుని ఏదో మెసేజ్ చేస్తున్నట్టు ఏవేవో చేస్తుంది.ఇంకో చోట కోతి చీర కట్టుకుని మురిసిపోతున్న వీడియో చూశాం.
అంతకు ముందు కోతి కుక్కతో ఫ్రెండ్ షిప్ చేయడాన్ని చూశాం.ఇలా అనేక రకాలుగా కోతులు ప్రవర్తిస్తున్నాయి.
అయితే కొన్ని సార్లు ఈ కోతులు చేసే పనులు విషాదాంతంగా కూడా మారుతున్నాయి.అవి ప్రతి ఒక్కరి మనసులను కలిచి వేసేలాగా ఉంటున్నాయి.వాటికి తెలిసి చేయకపోయినా ప్రతిఫలం మాత్రం మనుషులమైన మనమే అనుభవించాలి.అందుకే కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కానీ కొందరు పోకిరీలు మాత్రం వాటితో ఏదో చేయబోయి చివరకు ఇబ్బంది పడుతున్నారు.ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే వైరల్ అవుతోంది.
దీన్ని చూసిన తర్వాత కోతులతో ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం అవుతుంది.
ఒక వ్యక్తి తనకు దగ్గరలోని ఓ కోతి దగ్గరకు వెళ్లాడు.అయితే దాని చేయి పట్టుకొని ఏదో ఆడిస్తున్నట్టు అటూ ఇటూ ఊపడం మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది.అయితే ఆ కోతి కూడా అతన్ని ఏమీ అనకుండా కొద్ది సేపు చూస్తుంటుంది.
ఇంతలోనే ఏమైందో ఏమో గానీ అతని చేతిని ఆ కోతి పట్టుకుని కరిచేందుకు ముందుకు వస్తుంది.దీంతో భయపడ్డ ఆ వ్యక్తి చేతిని విదిలించుకుని దూరంగా పరిగెత్తుతాడు.
కొంచెం ఆలస్యం అయినా దాని దాడికి గాయపడేవాడు.ఇదంతా కూడా అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
.