బండ‌రాయి అనుకుని చేయి వేయ‌బోయాడు.. తీరా చూస్తే మైండ్ బ్లాంక్‌

సెల్ఫీ మోజులో ఓ వ్యక్తి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.ఈ మధ్య కాలంలో చాలా మంది అడ్వెంచర్స్ పేరుతో సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.

 He Felt Like A Rock And Put His Hand On It If You Look Further Details, Your Min-TeluguStop.com

దీంతో తమ ప్రాణాలు రిస్కులో పడవేయడమే కాకుండా ఇతరుల జీవితాలను కూడా రిస్కులో పడవేస్తున్నారు.సెల్ఫీ కోసం.

నడుస్తున్న రన్నింగ్ ట్రైన్స్, బస్సులు నుంచి ప్రమాదకర ఫీట్స్ చేయడం, ఇక ఎత్తైన బిల్డింగ్, టవర్స్ మీద నుంచి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు కిందపడిపోయి మరణించిన వారు చాలా మందే ఉన్నారు.సోషల్ మీడియాలో తాము వైరల్ కావాలనే పిచ్చి కూడా తమ ప్రాణాల మీదకు తెస్తోంది.

ఈ క్రమంలోనే ఓ వ్యకి జూ పార్క్‌కు వెళ్లి మొసలితో సెల్ఫీ దిగుతూ దానికి దొరికిపోయాడు.అయితే, ఆ క్రూరమైన సరీసృపం నుంచి ఎలా తప్పించుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిలిప్పిన్స్‌లోని సహా కాగయన్ డి ఓరో సిటీలో ‘అమయా వ్యూ’ అనే పేరుగల అమ్యూజ్‌మెంట్ పార్క్‌ ఉంది.ఓ రోజు నెహెమియాస్ చిపాడా (60) అనే వ్యక్తి తన ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకుని ఈ పార్క్‌కు వెళ్లాడు.

అక్కడ ఓ కొలను మొసళ్లు కనిపించాయి.కానీ అవి చూసేందుకు ఆర్టిఫిషీయల్ లాగా ఉన్నాయి.

చిపాడా సరదాగా మొసలితో సెల్ఫీ తీసుకునేందుకు కొలనులోకి ఎంట్రీ ఇచ్చాడు.మొబైల్‌ను ఒక చేతితో పట్టుకుని పన్నెండు అడుగుల మొసలిపై మరో చేయి వేసి సెల్ఫీ తీసుకుంటుండగా.

సడన్‌గా మొసలి చిపాడా ఎడమచేయి పట్టుకుని అతనిపై దాడి చేయడానికి యత్నించింది.ఎలాగోలా దాని నుంచి తప్పించుకుని బయటపడిన చిపాడా ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్లు ట్రీట్మెంట్ అందించారు.

అతను సేఫ్ అని చెప్పారు.

Telugu Park, Chippada, Crocodile, Selfie-Latest News - Telugu

అయితే, కొలనులో ఎలాంటి హెచ్చరిక బోర్డులు, అందువల్లే చిపాడా ప్రాణాల మీదకు వచ్చిందని బాధిత ఫ్యామిలీ మెంబర్స్ పార్కు నిర్వాహకులపై ఆరోపించారు.అయితే, అదంతా అబద్దమని అమయా వ్యూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కాండీ ఉనాబియా ఖండించారు.తాము పార్క్‌ పర్యటన బుక్‌లో ముందుగానే అన్ని విషయాలను పొందుపరిచామని నిర్వహకులు చెబుతున్నారు.

కాగా, చిపాడా వైద్య ఖర్చులను తామే భరిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube