అతడు హోటల్లో మంచినీళ్లు తాగి .. టిప్పు ఎంత ఇచ్చాడో తెలుసా ..?     2018-10-23   17:19:37  IST  Sai Mallula

హోటల్ కి వెళ్లి తృప్తిగా కావాల్సినవన్నీ తిని బిల్లు కట్టి మనకు సర్వ్ చేసిన వ్యక్తికి పదో పరకో టిప్ ఇచ్చి రావడం సాధారణంగా అందరూ చేసేపని. అయితే లక్షలకు లక్షలు టిప్పు కింద ఇవ్వడం మాత్రం నిజంగా విడ్డూరమే . ఆ టిప్పు తీసుకున్న వారు కూడా షాక్ అవ్వాల్సిందే. అలాంటి షాక్ నార్త్‌ కరోలినాకు చెందిన అలియానా కస్టర్‌ కి తగిలింది. ఆమెకు టిప్‌గా లభించింది పదో పరకో కాదు ఏకంగా 10 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు 7 లక్షల 38 వేల రూపాయలు.

He Drinks Water In The Hotel Seven Laks Tip Given To Server-

He Drinks Water In The Hotel Seven Laks Tip Given To Server

అంత టిప్పు ఇవ్వడానికి… ఆ కస్టమర్‌కి అలియానా సర్వ్‌ చేసింది కేవలం రెండు గ్లాసుల మంచినీళ్లే. అవును కేవలం మంచినీళ్లు తాగి హోటల్‌ను వీడిన ఆ కస్టమర్‌.. ‘రుచికరమైన నీళ్లు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు’ అంటూ ఓ పేపర్‌పై రాసి అలియానాను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతేకాదు మళ్లీ కాసేపటి తర్వాత తన సిబ్బందితో సహా తిరిగి వచ్చి అలియాకు ఓ హగ్‌ కూడా ఇచ్చి వెళ్లాడు. ఇంతకీ అతను ఎవరో కాదు యూట్యూబ్‌ స్టార్‌ మిస్టర్‌ బీస్ట్‌. సుమారు 8.9 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్న బీస్ట్‌, అలియానా భావోద్వేగాలను కూడా తన కెమెరాలో బంధించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు.