అడవిలో జీబ్రాలా వేషం ధరించాడు.. ఇంతలో సింహాలు ఒక్కసారిగా దాడి

మారు వేషాలు వేసి, ఇతరులను భయపెట్టడం చాలా మందికి సరాదా ఉంటుంది.తలకు జంతువులా, దెయ్యంలా మాస్కు ధరించి, అమాయకులను, చిన్నపిల్లలను భయపెడుతుంటారు.

 He Dressed As A Zebra In The Forest  Meanwhile, The Lions Attacked At Once ,fore-TeluguStop.com

వారు భయపడగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటారు.ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రాంక్ వీడియోలు బాగా అలరిస్తున్నాయి.

దెయ్యం తరహాల డ్రెస్ వేసుకోవడం, దారి వెంట వెళ్లే అమ్మాయిలను ఏడిపించడం ఆ తర్వాత తాము చేసింది ప్రాంక్ అని చెప్పడం చూపరులను భలే ఆకట్టుకుంటుంది.మరికొందరికి ప్రాంక్ వీడియోలు కంటే సఫారీ టూర్ అంటే ఇష్టం.

అడవిలో జంతువులను చాలా దగ్గర నుంచి చూసి, సరికొత్త అనుభూతికి లోనవుతుంటారు.అది వారికి ఇష్టంగా ఉంటుంది.

అందుకే పనిగట్టుకుని, ఇతర దేశాలకు వెళ్తుంటారు.అయితే ఇలా మారు వేషం ధరించి అడవిలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు.

అయితే ఓ వ్యక్తి అలా చేసి ఇబ్బందులకు గురయ్యాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

సోషల్ మీడియా నిత్యం జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు మనకు అందుబాటులో ఉన్నాయి.కొన్ని ఫన్నీ వీడియోలు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి.మరికొన్ని భయపెడుతుంటాయి.ఇంకొన్ని ఆశ్చర్య పరుస్తుంటాయి.ఇక కొందరు జూ వంటి వాటికి వెళ్లి సింహాలను, పులులను, కోతులను చూసి వాటితో వీడియోలు చేస్తుంటారు.తాజాగా ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఇద్దరు వ్యక్తులు అడవికి వెళ్లారు.అక్కడ జీబ్రాలు ఉంటాయి.

వాటిలో ఒకరిగా కలిసిపోయేందుకు ఏకంగా జీబ్రాలు మాదిరిగా డ్రెస్‌లు ధరించారు.ఆపై వాటితో కలిసి సంతోషంగా గంతులు వేశారు.

ఇదిలా ఉండగా అనూహ్య ఘటన జరిగింది.జీబ్రాలను వేటాడేందుకు సింహాల గుంపు వచ్చాయి.

వాటిని చూసి జీబ్రాలు పారిపోయాయి.అయితే జీబ్రాల మాదిరిగా డ్రెస్ వేసుకున్న వ్యక్తిపై సింహాలు దాడి చేశాయి.

ముఖ్యంగా అతడి తలను లాగగానే అది ఊడి పడిపోయింది.దీంతో సింహాలు షాక్ అయ్యాయి.

ప్లాస్టిక్ తలను ఓ సింహం ఆహారం అనుకుని కొరుక్కు తినాలని ప్రయత్నించింది.ఇక సింహాల బారి నుంచి జీబ్రాల మాదిరిగా డ్రెస్ వేసుకున్న వారు ఒడుపుగా తప్పించుకున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.సింహాలకు ఏ మాత్రం ఆకలి వేసినా, కొరుక్కు తింటాయని, మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube