Temple ox : గుడికి ఎద్దును దానమిచ్చాడు.. అందుకు 300 కి.మీ. కాలినడకన ప్రయాణం..

మన దేశంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన మత విశ్వాసాలను మాత్రం ఎవరూ మర్చిపోరు.ఇస్రో ద్వారా అంతరిక్షంలోకి రాకెట్ పంపినా, తిరుపతి వెళ్లి టెంకాయ కొడతారు.

 He Donated A Bull To The Temple 300 Km For That. Traveling On Foot Temple, Cow,-TeluguStop.com

రాకెట్ ప్రయోగం నిర్విఘ్నంగా కొనసాగాలని దేవుడిని వేడుకుంటుంటారు.దేవుళ్లను నమ్మని వారికి, విదేశీయులకు మన ఆచార వ్యవహారాలు కొంచెం వింతగా అనిపిస్తుంటాయి.

అయితే మనవాళ్లు అవేమీ పట్టించుకోరు.మన విశ్వాసాలను మాత్రం చక్కగా కొనసాగిస్తుంటారు.

తాజాగా ఇలాంటి ఓ సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.మొక్కు తీర్చుకోవడం కోసం ఏకంగా సాహసం చేశాడు.

తన పెంపుడు ఎద్దుతో కలిసి ఏకంగా 300 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు.మధ్యలో తన వర్క్ మాత్రం ఆపలేదు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా హొరనాడు వాసి శ్రీయంషా కేడి (32) బీటెక్ గ్రాడ్యుయేట్.

బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు.అయితే సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా, అతడికి ఉన్న పశువులపై ప్రేమ తగ్గలేదు.

తన ఇంటి పక్కనే ఖాళీగా ఉండే స్థలంలో 2020లో గుజరాత్ నుంచి గిర్ జాతికి చెందిన ఆవును, దూడను కొనుగోలు చేశాడు.ఆ సమయంలో దూడకు భీష్మ అని పేరు పెట్టడమే కాకుండా దానిని అల్లారుముద్దుగా పెంచాడు.

ధర్మస్థల ప్రాంతంలోని శ్రీ మంజునాథ స్వామి అంటే అతడికి ఎంతో భక్తి.ఆ దేవాలయానికి తాను పెంచుకుంటున్న భీష్మను ఇస్తానని మొక్కుకున్నాడు.

దీంతో తన మొక్కు తీర్చుకునేందుకు ఇటీవల సిద్ధం అయ్యాడు.

Telugu Karnataka, Ox Gift, Temple, Journey-Latest News - Telugu

తాను ఉంటున్న ప్రాంతం నుంచి 300ల కిలోమీటర్ల దూరంలోని మంజునాథ స్వామి ఆలయానికి ఆయన కాలినడకన పయనం అయ్యాడు.మధ్యలో తన పని మాత్రం ఆపలేదు. ల్యాప్‌టాప్‌లో వర్క్ కొనసాగించాడు.

చివరికి 36 రోజుల తర్వాత ఆలయం చేరుకున్న తర్వాత తన మొక్కు తీర్చుకున్నాడు.ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube