మనిషి ముఖం కలిగిన వింత జీవి పుట్టుక.. అంతలోనే..?!

కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇదివరకు కాలంలో చెప్పినట్టు ఎన్నో విశేషాలు అప్పుడప్పుడు ప్రపంచంలో జరుగుతూనే ఉండడం మనకు గమనిస్తూనే ఉన్నాం.అసలు ఊహించని విధంగా కొన్ని సంఘటనలు మనకు వాస్తవ రూపం దాలుస్తున్నాయి.

 He Birth Of A Strange Creature With A Human Face  In The Meantime  ?! Viral, Goa-TeluguStop.com

అలాంటి ఓ విషయం తాజాగా ఆవిష్కృతమైంది.తాజాగా ఓ వింత సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పరిచేలా చేస్తోంది.

అది ఎలా అంటే.ఓ మేక అచ్చం మనిషి ముఖంతో పోలి ఉన్న వింత జీవికి ఈ జన్మను ఇచ్చింది.

అయితే ఆ జీవి పుట్టాక ఎక్కువసేపు బతకలేదు.అయినా కానీ ఆ వింత జీవిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో సంభవించింది.

రాష్ట్రంలోని  సోనాఘడ్ తాలూకా సెల్టిపేట గ్రామానికి చెందిన అజయ్ అనే ఓ రైతు కుటుంబంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఈయన మేకలను పెంచుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.

తాజాగా అతడి ఇంట్లో ఉన్న ఓ మేక ప్రసవించింది.మేక ప్రసవించడం పెద్ద సంగతి కాకపోయినా కానీ ఆ మేక ప్రసవించిన జీవి చూడటానికి వింతగా అనిపించడంతో అదికాస్తా వార్తల్లో నిలిచేలా జరిగింది.

ఓ వింత జీవి కి జన్మ ఇవ్వడంతో ఆ ఊర్లోనే జనమంత, అలాగే చుట్టుపక్కల ఉన్న ఊర్లలో జనం కూడా ఆ జీవిని చూసేందుకు పెద్ద ఎత్తున ఆ రైతు ఇంటికి క్యూ కట్టారు.

ఆ వింత జీవి అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉండటంతో ఆ జీవిని దేవుడు ప్రతి రూపం అంటూ గ్రామస్తులు పూజలు చేశారు.

నిజానికి ఏ మేకకు అయినా సరే తోక ఉంటుంది.కాకపోతే.ఈ వింత జీవికి తోక లేదు.అచ్చం మనిషి ఉన్నట్టుగానే నోరు, ముక్కు, ముఖం అన్ని ఉన్నాయి.

ఈ జీవి జన్మించిన తర్వాత కేవలం పది నిమిషాలు మాత్రమే బతికే ఉంది.ఆ తర్వాత ఆ వింత జీవి ప్రాణాలు వదిలింది.

అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జీవికి ఆ గ్రామంలోని ప్రజలందరూ కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.దీంతో ఈ వింత జీవికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube