కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఆయ‌నేనా.. రేవంత్ మ‌న‌సులో కృష్ణారెడ్డి...!

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావ‌డ‌మేంటో గానీ ఆయ‌న‌కు వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి.మొద‌టి నుంచి పార్టీ సీనియ‌ర్లు వ్క‌తిరేకించినా ఆయ‌న చీఫ్ అయ్యాక అన్నీ స‌ద్దుమ‌ణుగుతాయ‌ని అంతా అనుకున్నారు.

 He A Congress Candidate .. Krishnareddy In Rewanth Mind , Revanth, Congress Cand-TeluguStop.com

కానీ అనూహ్యంగా ఆయ‌న‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.చాలామంది క‌నీసం ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌ట్లేదు స‌రిక‌దా రేవంత్ రెడ్డి స్వ‌యంగా వ‌చ్చి క‌లుస్తాన‌ని చెప్పినా కూడా ఎవ‌రూ ఇంట్రెస్ట్ చూపించ‌ట్లేదు.

ఇక ఆయ‌న పార్టీ చీఫ్ అయిన త‌ర్వాత వ‌స్తున్న మొద‌టి స‌వాల్ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌.అన్ని పార్టీలూ ఎంతో కీల‌కంగా తీసుకుంటున్న ఈ ఎన్నిక ఇప్పుడు ఆయ‌న‌కు పెద్ద స‌వాల్‌గా మారుతోంది.

ఇక ఏదేమైనా ఆయ‌న‌కు కౌశిక్ రెడ్డి రూపంలో కొంత ఊర‌ట క‌లిగినా ఆయ‌న చివ‌ర‌కు టీఆర్ ఎస్‌లో చేర‌డంతో మ‌ళ్లీ పెద్ద దెబ్బే త‌గిలింది.ఇక మొద‌టి నుంచి క‌రీంన‌గ‌ర్ మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్‌కు ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రిగినా చివ‌ర‌కు ఆయ‌న వ‌ల్లే కౌశిక్ పార్టీని వీడార‌నే అప‌వాదం ఉండటంతో ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశారు రేవంత్‌.

అయితే ఇప్పుడు మ‌రో కీల‌క నేత పేరును ప‌రిశీలిస్తున్నారు.ఆయ‌నే ప‌త్తి కృష్ణారెడ్డి.ఈయ‌న కౌశిక్ రెడ్డి త‌ర్వాత కీల‌కంగా హుజూరాబాద్‌లో ఉంటున్నారు.అయితే గ‌తంలోనే ఈయ‌న‌కు టికెట్ ద‌క్కాల్సి ఉన్నా కూడా ఉత్త‌మ్‌కు కౌశిక్ ద‌గ్గ‌రి బంధువు కావ‌డంతో రాలేదు.

Telugu Congress Candi, Huzurabad, Koshik Reddy, Pathikrishna, Revanth, Ts Congre

దీంతో అప్ప‌టి నుంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు.మొద‌టి నుంచి రైతు సంఘం ఉద్య‌మ‌నాయ‌కుడిగా నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ఇమేజ్ ఉంది.కేంద్ర తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఈయ‌న ఎన్నో ఉద్య‌మాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక కౌశిక్ సామాజిక వ‌ర్గ‌మే కావ‌డంతో ఆ ఇమేజ్ క‌లిసి వ‌స్తుంద‌ని రేవంత్ భావిస్తున్నారంట‌.

అందుకే ఆయ‌న్ను దింపితే మ‌చ్చ లేని నాయ‌కుడిగా ఓట్లు రాలే అవ‌కాశం ఉంటుంద‌ని రేవంత్ భావిస్తున్నారు.మ‌రి రేవంత్ ఏం చేస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube