ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.కాగా ఆ వ్యక్తి రాసిన సూసైడ్ నోట్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ ఆ వ్యక్తి అందులో ఏం రాశాడనేగా మీరు ఆలోచిస్తున్నారా.? తన భార్యకు మళ్లీ పెళ్లి చేయాలంటూ ఆ వ్యక్తి తన సూసైడ్ నోట్‌లో రాశాడు.
హైదరాబాద్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జూబ్లీహిల్స్ శాఖ డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న చిత్తలూరి శ్రవణ్ కుమార్(29)కు ఏడాది క్రితం సూర్యాపేటకు చెందిన ఓ యువతితో వివాహం జరిగింది.వీరు జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని గాయత్రిహిల్స్‌లో నివాసముంటున్నారు.
ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న శ్రవణ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.కాగా ఇటీవల తన భార్య పుట్టింటికి వెళ్లడంతో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రవణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా ప్రస్తుతం అతడు స్పృహలో లేడని పోలీసులు తెలిపారు.అతడు ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ రాశాడని, అందులో తాను ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు.
కాగా అతడి భార్య చాలా మంచిదని, తన మరణం తరువాత ఆమెకు మళ్లీ పెళ్లి చెయాలంటూ కోరాడు.కాగా తనకు ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలని, ఆ డబ్బుతో తన అంత్యక్రియలు చేయాలని శ్రవణ్ కోరాడు.
కాగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నారు.