వారానికి ఒకసారి ఆఫీసుకు రండంటున్న కంపెనీ!

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొద్ది నెలల నుంచి ప్రముఖ సాఫ్టవెర్ కంపెనీలు వారి స్టాప్ ను తగ్గించి మిగిలిన కొద్దిపాటి స్టాఫ్ తో వర్క్ ఫ్రం హోం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.లాక్ డౌన్ విధించిన ప్పటినుంచి ప్రతి ఒక్క కంపెనీ తమ ఎంప్లాయిస్ తో వర్క్ ఫ్రం హోం నిర్వహిస్తోంది.

 Hcl Company Asked Employees To Come Office Once In A Week, Hcl, Company, Vv Appa-TeluguStop.com

అయితే ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఎంప్లాయిస్ నీ ఆఫీస్ కు వచ్చి విధులు నిర్వహించవలసిందిగా తెలియజేసింది.కరోనా రాకముందు ఎలాంటి పరిస్థితిలో కూడా వర్క్ ఫ్రం హోమ్ కు అనుమతి ఇవ్వని కంపెనీలు ప్రస్తుతం వారానికి ఒకసారి మాత్రమే ఆఫీసుకు రావాలని తెలియజేస్తుంది.

పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులందరినీ తప్పకుండా ఆఫీస్ కు అటెండ్ కావాలని సూచించాయి.కాకపోతే హెచ్ సిఎల్ కంపెనీ మాత్రం అందుకు భిన్నంగా కేవలం వారంలో ఒక రోజు ఆఫీసుకు వచ్చి మిగతా రోజులు వర్క్ ఫ్రం హోం లో విధులు నిర్వహించాలని తమ ఉద్యోగులకు సూచించింది.

ఆఫీస్ కు వచ్చే ఉద్యోగులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంది.ఇప్పటికే 5 శాతం మంది ఉద్యోగులతో కంపెనీ వ్యవహారాలు నడుస్తున్న నేపథ్యంలో డిసెంబర్ కల్లా 20 శాతం మంది ఉద్యోగులను పెంచేలా కంపెనీ చర్యలు చేపడుతోంది.
కరోనా వ్యాధి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని అన్ని జాగ్రత్తలు చేపట్టినట్లు, కంపెనీ సి.హెచ్ఆర్ వో తెలిపారు.సోషల్ డిస్టెన్స్ తో పాటిస్తూ విధులు నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.అయితే ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నవారు,50 సంవత్సరాలు పైబడి తల్లిదండ్రులు ఉన్న వారు వారంలో ఒక్క రోజు కూడా ఆఫీసుకు రావలసిన అవసరం లేదని అలాంటి వారు వర్క్ ఫ్రం హోం చేయాలని హెచ్ సిఎల్ కంపెనీ సిహెచ్ఆర్ఓ అప్పారావ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube