జగన్ కేసులో వేగం లేదు

ఒకప్పుడు వై ఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మీడియాలో సంచలనం కలిగించింది.పత్రికలు, చానళ్ళు ఊదరగొట్టాయి.

 Hc Asks Cbi Court To Speed Up Ys Jagan Case-TeluguStop.com

జగన్ ఏడాదిగా పైగా జైల్లో ఉన్నాడు.జగన్ పని అయిపోయిందని, ఇక జైలు నుంచి బయటకు రాడని టీడీపీ సహా ఆయనతో పడని నాయకులు అంతా అనుకున్నారు.

రాజకీయాల్లో అడ్డు తొలగిపోయిందని సంతోషించారు.కాని ఆయనకు బెయిలు దొరికింది.

బెయిలు మీద ఉండబట్టి చాలా కాలం అయింది.రాష్ట్ర విభజన జరిగి, కొత్త ప్రభుత్వాలు ఏడాది పాలన కూడా ముగించాయి.

అయినా జగన్ కేసు విచారణ ముందుకు పోలేదు.ఆయన ప్రస్తుతం ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్నాడు.

జగన్ కేసు విచారణ ఆలస్యం కావడంపై విజయవాడకు చెందిన ఒక లాయరు హై కోర్టులో పిటిషన్ వేసాడు.ఆయన వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) మీద స్పందించిన హై కోర్టు కేసు విచారణలో వేగం పెంచాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది.

ఈ కేసులో ఎమ్మెల్యేలు, ఎంపీల మీద దాఖలైన అన్ని పిటిషన్లను తొందరగా విచారించాలని కోరింది.జగన్ కేసుకు సంబంధించి 8 కేసులు తమ దగ్గర పెండింగులో ఉన్నాయని సీబీఐ కోర్టు లాయరు తెలిపారు.

ఈ కేసులో నిందితులైన వారు కొందరు తమ పేర్లు తొలగించాలని డిశ్చార్జ్ పిటిషన్లు వేసినట్లు చెప్పారు.ఏది ఏమైనా జగన్ కేసు విచారణ తొందరలోనే మొదలు కావొచ్చు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube