సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి అక్కినేని నాగ చైతన్య బర్త్ డే విషెస్..!

అక్కినేని వారి ఇంట మూడో తరంలో మొదటి హీరోగా పరిచయమైన వ్యక్తి అక్కినేని నాగ చైతన్య.ప్రస్తుతం ఆయన బిజీ బిజీగా సినిమాలతో తన కెరీర్ ను ముందుకు తెస్తున్నారు.

 Akkineni Naga Chaitanya Birthday Tweets Viral In Social Media, Naga Chaitanya, A-TeluguStop.com

ఈ మధ్య కాలంలోనే పేరుకు ముందర యువసామ్రాట్ అనే ట్యాగ్ లైన్ ని కూడా నోచుకున్నాడు కూడా.ఇదివరకు కొన్ని వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడిన ఆయన మజిలి సినిమా తో మరోసారి హిట్ ట్రాక్ పై పడ్డాడు.

గత సంవత్సరం లో వచ్చిన తన మేనమామతో కలిసి తీసిన సినిమా వెంకీ మామ తో కూడా ఆయన పర్వాలేదు అనిపించుకున్న, ప్రస్తుతం ఆయన క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి తో కలిసి లవ్ స్టోరీ అనే చిత్రంలో నటించాడు.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ పనులు పూర్తి అవ్వగా.

విడుదలకు సిద్ధం అవుతోంది.

జయాపజయాలతో తన కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న నాగ చైతన్య నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా అక్కినేని అభిమానులు రెడీ చేసిన ఓ సిడిపి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.ఈ సిడిపి ను నాగచైతన్య మేనమామ అయిన విక్టరీ వెంకటేష్ ట్విట్టర్ ద్వారా పంచుకోగా ప్రస్తుతం అది టాప్ ట్రెండ్ లో ఉండడం నిజంగా విశేషమే.

జోష్ సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలు పెట్టిన నాగచైతన్య తర్వాత ఏం మాయ చేశావే తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.ఇక ఆ తర్వాత 100% లవ్, మనం, ప్రేమమ్, మజిలీ, వెంకీ మామ చిత్రాలతో తనదైన శైలిలో కథలు ఎంచుకుంటూ హీరోలలో ఒకరిగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.ఇకపోతే ఇదివరకు మొత్తం 18 సినిమాల్లో హీరోగా నటించిన నాగ చైతన్య అందులో కేవలం సింగిల్ డిజిట్ సినిమాలు మాత్రమే విజయాన్ని అందుకున్నాయి.ఒకవైపు విజయాలు తక్కువ ఉన్న నటనలో మాత్రం తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.

ఇక తన నిజ జీవితంలో హీరోయిన్ సమంత ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే.ముందు ముందు మరిన్ని చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించాలని భావిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube