బట్టతలతో ఇబ్బందులు పడుతున్నారా..? అయితే ఇలా ఫాలో అవ్వండి...!

ప్రస్తుతం ప్రపంచంలో చాలామంది ఉరుకులు పరుగులు పెడుతున్న జీవితాన్ని గడుపుతున్నారు.చివరికి పనిలో పడి పని ఒత్తిడి కారణంగా తినడం కూడా మానేస్తున్నారు.

 Having Trouble With Bald Head But Follow Like This Cocount Oil, Amala Oil, Hair-TeluguStop.com

అంతేకాదు అనేక రకాల మానసిక వ్యాధులకు గురై అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ మానసిక వ్యాధుల కారణంగా కొంత మందికి వారి తలపై ఉన్న వెంట్రుకలను కోల్పోయి చివరికి బట్టతల ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది.

దీంతో అనేక మంది జుట్టు రాలిపోతుంది అంటూ హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డాక్టర్లకు సమర్పించుకుంటున్నారు.అయితే అన్ని సమస్యల మాదిరిగానే బట్టతల వచ్చే ముందు కూడా కొన్ని సూచనలు మనకు కనబడతాయి.

అవి ఏమిటో వాటి నుంచి ఎలా బయటపడాలి లాంటి విషయాలను గురించి తెలుసుకుందాం.

మామూలుగా బట్టతల ఏర్పడే సమయంలో వెంట్రుకలు ఎక్కువగా రాలిపోవడం, అలాగే ఒకే ప్రాంతంలో జుట్టు ఎక్కువగా ఊడిపోవడం వంటి సమస్యలు మనకు కనిపిస్తాయి.

అంతేకాకుండా తలపై జుట్టు పలుచగా ఉండటమే కాకుండా తల మొత్తం బోసి పోయినట్లుగా కనబడుతుంది.ఇలాంటి సూచనలు కనపడినప్పుడు ఎలాంటి ఇబ్బందులకు గురి అవకుండా కచ్చితంగా వారి నెత్తి పై కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బట్టతల నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అన్న విషయం పై కొందరు నిపుణులు సూచిస్తున్నారు.అవేమిటో ఓసారి చూద్దాం.

ఇకపోతే 100 ml కొబ్బరినూనెలో 50ml ఉసిరి నూనె కలిపి వాట్తి పాటు ఒక ఒక ఐదు టేబుల్ స్పూన్లు నిమ్మరసం కలుపుకొని వెంట్రుకల కుదుళ్ల వద్ద వాటిని రాసుకోవాలి.అలా వెంట్రుకల కుదుళ్ల వద్ద రాసుకున్న నూనెను ఓ గంట సమయం అలాగే ఉంచి ఆ తర్వాత కుంకుడు రసం లేదా ఏదైనా తక్కువ మోతాదు ఉన్న షాంపూతో తలస్నానం కి ఉపయోగించాలి.

ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య మాత్రమే కాకుండా బట్టతల రాకుండా కూడా చూసుకోవచ్చు.అలాగే కొబ్బరి నూనెలో ఉసిరిపొడిని కలుపుకొని తలకి రాత్రి పూట పెట్టుకొని ఉదయం స్నానం చేస్తే ఈ సమస్యకు ఈ విధంగా కూడా చెక్ పెట్టవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube