ఎస్వీ రంగారావు పెళ్లి ఫొటో చూశారా.. అప్పటి విశేషాలు ఇవే..!

ఎస్వీ రంగారావు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరూ ఉండరు.విశ్వనట చక్రవర్తిగా బిరుదు గాంచిన యశస్వీ ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

 Have You Seen Actor Sv Rangarao Marriage Pic Sv Rangarao, Marriage, Tollywood,-TeluguStop.com

వెండితెర వెలుగురేఖగా 30 ఏళ్లు సినిమాల్లో నటించిన ఆయన అందుకోని అవార్డు లేదంటే అతిశయోక్తి కాదు.నటుడిగా మాత్రమే కాదు డైరెక్టర్‌గా కూడా రాణించారు.

ఎస్వీఆర్ నటుడు కావడం తెలుగువారు చేసుకున్న పుణ్యం అని కూడా అంటారు.అంతలా గొప్ప పేరు తెచ్చుకున్న ఎస్వీఆర్ వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటి సినీ లోకానికి తెలిసింది తక్కువే.

ముఖ్యంగా అతని భార్య గురించి సినీ అభిమానులకు తెలిసింది మరీ తక్కువ.

అయితే తాజాగా ఈ యాక్టర్ పెళ్లినాటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు.“ఎస్వీ రంగారావు గారి భార్యను చూడటం ఇదే మొదటిసారి.ఇద్దరూ భలే చూడముచ్చటగా ఉన్నారు.పెళ్లి దుస్తుల్లో రంగారావు హీరోలా భలే అందంగా ఉన్నారు” అని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.రంగారావు భార్య పేరు లీలావతి కాగా ఆమెను 1947లో పెళ్లి చేసుకున్నారు.అప్పటికి అతని వయసు 29 ఏళ్లు.

వీరికి విజయ, ప్రమీల, కోటేశ్వరరావు అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.లీలావతి బడేటి వెంకట రామయ్య, కోటేశ్వరమ్మ దంపతుల కుమార్తె.

Telugu Godavari, Rajahmundry, Sv Ranga Rao, Sv Rangarao, Tollywood-Latest News -

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరంలో రంగారావు జన్మించారు.తండ్రి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గా పని చేసేవారు.రంగారావు కూడా సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి అగ్నిమాపక శాఖలో ఓ పెద్ద ఉద్యోగం సంపాదించారు.అయితే నటనపై ఆసక్తితో సినిమాల వైపు మళ్లారు.భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపుడిగా.మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడిగా.

పాతాళ భైరవిలో నేపాళ మాంత్రికుడిగా జీవించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.ఆయన హావభావాలు, పలికించిన నవరసాలు చూసి.

ఇంగ్లీష్ సినిమాల్లో రంగారావు నటించినట్లయితే అన్ని ఆస్కార్ అవార్డులు ఆయనకే లభించి ఉండేవని పెద్దలు అంటుంటారు.ఈ వర్సటైల్ యాక్టర్ తన 56వ యేట గుండెజబ్బుతో కన్నుమూశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube