వాట్సాప్‌లో ఈ మార్పులు గమనించారా.. అయితే మిమ్మల్ని ఎవరో బ్లాక్ చేసినట్టే..!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు వాట్సాప్‌ మెసేజింగ్ అప్లికేషన్ వాడుతున్నారు.ప్రియమైన వారితో చాటింగ్ చేయడానికి మాత్రమే కాదు వాట్సాప్ వ్యాపార కార్యకలాపాల్లో కూడా చాలా ఉపయోగపడుతోంది.

 Have You Noticed These Changes In Whatsapp But Someone Has Blocked You-TeluguStop.com

యూజర్ల కోసం వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్‌లను తీసుకొస్తుంది.ఇష్టం లేని వ్యక్తుల నుంచి మెసేజ్ లు రాకుండా చేసేందుకు వీలుగా కొన్నాళ్ల క్రితమే వాట్సాప్ బ్లాక్ అనే ఫీచర్ పరిచయం చేసింది.

మీరు ఈ ఫీచర్ ఉపయోగించి అవతల వ్యక్తిని బ్లాక్ చెయ్యొచ్చు.అలాగే అవతలివారు కూడా మిమ్మల్ని బ్లాక్ చేయగలరు.

 Have You Noticed These Changes In Whatsapp But Someone Has Blocked You-వాట్సాప్‌లో ఈ మార్పులు గమనించారా.. అయితే మిమ్మల్ని ఎవరో బ్లాక్ చేసినట్టే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ అవతల వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడం కాస్త కష్టమే.ఎందుకంటే ప్రైవసీ కారణాలవల్ల వాట్సాప్ బ్లాక్ కాబడిన వ్యక్తికి ఎలాంటి నోటిఫికేషన్లు పంపించదు.

ఐతే ఇది తెలుసుకోవడానికి కొన్ని మార్పులను చెక్ చేస్తే సరిపోతుంది.ఆ మార్పులు ఏమిటో తెలుసుకుందాం.

ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే వారి వాట్సాప్ చాట్ లో లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్ కనిపించదు.కొందరు లాస్ట్ సీన్ ఎవరికీ కనిపించకుండా దాచి పెడతారు.

ఇలాంటి సమయంలో మీరు మరొక మార్పు కూడా గమనించాల్సివుంటుంది.అదే ఆన్‌లైన్ స్టేటస్! మీకు ఏ సమయంలోనూ ఆన్‌లైన్ స్టేటస్ కనిపించకపోతే అవతల వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్టే అని గుర్తించాలి.

ప్రొఫైల్ ఫొటో కనిపించకపోయినా.మీరు పంపిన మెసేజ్‌కు డెలివరీ స్టేటస్ సింగిల్ టిక్‌మార్క్ గా చూపించినా.

మీరు బ్లాక్ అయినట్టే లెక్క.అలాగే వాట్సాప్ కాల్స్ కనెక్ట్ కావు.

Telugu Block, New Features, New Tricks, New Updates, Technology Updates, Whats Up-Latest News - Telugu

అయితే ఇప్పటివరకు చెప్పిన మార్పులన్నీ కనిపిస్తేనే మిమ్మల్ని అవతలివారు బ్లాక్ చేసినట్లు అనేది గమనించాలి.ఎందుకంటే పైన పేర్కొన్న ఒక్కో మార్పు మరో కారణం చేత కూడా మారవచ్చు.ఉదాహరణకి అవతల వ్యక్తి తన వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసినానెట్ కనెక్షన్ ఆఫ్ చేసినా అప్పుడు మనం వారికి కాల్స్ చేయలేం.ప్రొఫైల్ పిక్ ఫోటో కనిపించకపోవడానికి వారు ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకుని ఉండొచ్చు.

అందుకే అన్ని మార్పులు ఒకేసారి కనిపిస్తేనే మిమ్మల్ని అవతలివారు బ్లాక్ చేశారని అర్థం చేసుకోండి.

#Block

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు