ఇది విన్నారా? రైళ్లలో AC బోగీలలోశృంగార సర్వీసులు అంట?

ఇదెక్కడి ఘోరం అని అనుకుంటున్నారా? మొదట అందరూ అలాగే అనుకున్నారు.కొందరు ఔత్సాహికులైతే పండగ చేసుకున్నారు.

 Have You Heard This Sex Service In Ac Coaches In Trains-TeluguStop.com

అయితే అదంతా వట్టి పుకారు అని తేలిపోయింది.అవును, అది పాకిస్థాన్ హ్యాకర్ల పని. పాకిస్థాన్ రైల్వే సాఫ్ట్ వేర్ ని వాళ్ళు హ్యాక్ చేశారట.దీంతో ఎవరైనా రైలు టికెట్లు బుక్ చేసుకుంటే వాటిపైన సెక్స్ సర్వీస్ ఇన్ AC క్లాస్ అని వస్తోంది.

ఇప్పటివరకు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు క్రీడాకారుల ఆడియోలు వీడియోలు అంటూ పాకిస్థాన్లో ఇటీవల హ్యాకర్లు విడుదల చేశారు.ఇప్పుడు ఏకంగా రైల్వే సాప్ట్వేర్ ను హ్యాక్ చేయడం కాస్త విడ్డురమే అనుకోవాలి.

రైల్వే టికెట్లపై ఉండాల్సిన టికెటింగ్ సిస్టమ్ స్థానంలో AC క్లాసుల్లో “సెక్స్ సర్వీస్” అని టెక్ట్సును మార్చారు.దాంతో పాకిస్థాన్లో లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ‘ఏసీ క్లాస్లో సెక్స్ సర్వీస్ అందుబాటులో ఉంది’ అని పేర్కొన్న టికెట్లను చూసి పాక్ రైల్వే అందిస్తున్న సౌకర్యాలను చూసి షాక్ అయ్యారని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

కాగా సెప్టెంబరు 30న లోకల్ రైలులో కోట్ అడు నుండి వాహ్ వరకు ప్రయాణిస్తున్న ఒక ప్రయాణీకుడు తన రైలు టికెట్ పై… సెక్స్ సర్వీస్ ఎవాలబుల్ ఇన్ AC క్లాస్ అని ముద్రించడం చూశాడు.

అక్కడితో ఆగకుండా బుకింగ్ కార్యాలయానికి వెళ్లి, అక్కడ అతను టికెటింగ్ సిబ్బందిపై ఇదేమిటంటూ మండిపడ్డాడు.ఈ టికెట్ల వ్యవహారం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిందని వారికి చెప్పాడు.యువకుడి ఫిర్యాదు తర్వాత థాల్ ఎక్స్ప్రెస్ అధికారులు తప్పును గుర్తించారు.

తమ సాఫ్ట్వేర్ హ్యాక్ అయిందని పేర్కొంటూ స్థానిక రావల్పిండి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.గుర్తుతెలియని హ్యాకర్లపై కేసు నమోదు చేయాలని కోరారు.

ఈ చర్య పాక్ రైల్వే ప్రతిష్టను దెబ్బతీసినందున చర్యలు తీసుకోవాలని పోలీసులకు విన్నవించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube