జిమెయిల్ లో ఈ ఫీచర్స్ ను ఎప్పుడైనా వాడారా..?!

అప్పట్లో మనకు నార్మల్ మెసేజ్ తప్పా వేరే ఏమి తెలియదు.కానీ టెక్నాలజీ పెరగడంతో పాటు మనం కూడా అప్ డేట్ అయ్యాము కదా.

 Have You Ever Used These Features In Gmail-TeluguStop.com

ఇప్పుడు మెసేజెస్ తో పాటు ఈ మెయిల్, జీమెయిల్ సర్వీసులను కూడా ప్రజలు బాగా వినియోగిస్తున్నారు.ప్రస్తుతం బాగా పేరుగాంచిన సర్వీసులలో జీమెయిల్ ఒకటి.

అయితే జీ మెయిల్ లో కూడా మనం అందరికి తెలియని ఎన్నో సరికొత్త ఫీచర్స్ దాగి ఉన్నాయి.మరి యూజర్లకు ఉపయోగపడే ఆ ఫీచర్స్ ఏంటో ఒక లుక్ వేద్దామా.

 Have You Ever Used These Features In Gmail-జిమెయిల్ లో ఈ ఫీచర్స్ ను ఎప్పుడైనా వాడారా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జీమెయిల్ ఫీచర్స్ లో మొట్టమొదటగా మనం తెలుసుకోవాలిసిన ఫీచర్ లలో స్మార్ట్ కంపోజ్ ఒకటి.ఇది ఫీచర్ యూజర్లు ఏమి టైప్ చేయబోతున్నారో ముందుగానే ఉహించి వాటికి సంబంధించిన పదాలను మెయిల్ బాక్స్ లో ఇన్సర్ట్ చేయడానికి కూడా స్మార్ట్ కంపోజ్ అనుమతిస్తుంది.

ఈ ఫీచర్ మీరు ఎనేబుల్ చేయడానికి జీమెయిల్ సెట్టింగ్స్ లో స్మార్ట్ కంపోజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.ఆ తర్వాత రైటింగ్ సజెషన్స్ ఆన్ చేసి ఉంచాలి.

అలాగే జీమెయిల్ లో షెడ్యూల్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.ఈ ఫీచర్ ద్వారా ఈ – మెయిల్‌ లను మనం షెడ్యూల్ చేసి సెండ్ చేయొచ్చు.

ఇందుకు మనం చేయవలిసిందల్లా ఒక్కటే మీ కంప్యూటర్ లో ఈ-మెయిల్ మెసేజ్ టైపు చేసిన తర్వాత కుడివైపు ఉన్న యారో పై క్లిక్ చేయగా షెడ్యూల్ సెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి.అప్పుడు పిక్ డేట్ అండ్ టైమ్ ఆప్షన్ పై మళ్ళీ క్లిక్ చేసి మీరు ఏ సమయానికి మెయిల్ సెండ్ చేయాలనీ అనుకుంటున్నారో ఆ టైమ్ ను అక్కడ సెట్ చేస్తే సరి.మెయిల్ కంపోజ్ చేసిన తరువాత కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయగా షెడ్యూల్ సెండ్ ఆప్షన్ వస్తుంది.అక్కడ క్లిక్ చేసి టైం సెట్ చేసుకోనీమెసేజ్ ఫాస్టర్ ఫీచర్ గురించి మీరు వినే ఉంటారు.

ఈ ఫీచర్ మీరు మెసేజ్ డిలీట్ చేసిన వెంటనే మీ లిస్ట్ లోని మునుపటి ఈ-మెయిల్‌ ను చూపిస్తుంది.ఈ ఫీచర్ ను జీమెయిల్ డెస్క్‌ టాప్ వర్షన్‌, ఆండ్రాయిడ్‌ లో యాక్సెస్ చేయవచ్చు.

మీరు మీ జిమెయిల్ లో కొన్ని సెట్టింగ్స్ చేయడం ద్వారా అన్ని ఈ మెయిల్స్ ఒకేసారి ఒకే పేజీలో కనిపిస్తాయి.ఈ ఫీచర్ కోసం మీరు జీమెయిల్ జనరల్ ట్యాబ్ సెట్టింగ్‌ లలో మాక్సిమమ్ పేజీ సైజును మార్చాలి.అప్పుడు ఒకే పేజీలో ఎక్కువ మెయిల్స్ కనిపిస్తాయి.అలాగే ఏదన్నా మెయిల్ అర్జెంటుగా చూడాలని అనుకుంటే పాత మెయిల్స్ కి వెళ్లి అన్ని ఓపెన్ చేసి చూడడం అంటే కష్టం అయిన పని.అందుకే మీరు ఏదన్నా మెయిల్ చూడాలి అనుకుంటే బిఫోర్ యూజ్ చేయాలి.లేదా ఆఫ్టర్ యూజ్ చేయొచ్చు.

అంటే 2009 కంటే ముందు మెయిల్స్ చెక్ చేయాలనంటే బిఫోర్ 2009 అని సెర్చ్ బాక్స్ లో టైపు చేసి ఎంటర్ చేయాలి.అలాగే 2009 తరువాత మెయిల్స్ చూడాలంటే సెర్చ్ ఆప్షన్ లో ఆఫ్టర్ 2009 అని టైప్‌ చేసి ఎంటర్ చేయాలి.

కావాలనుంటే డేట్ అండ్ మంత్ తో కూడా సెర్చ్ చేసుకోవచ్చు.

#Gmail Hidden #Gmail #Email #Hacks #GmailHidden

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు