మీరు శవాలతో సెల్ఫీలు ఎపుడైనా దిగారా? కానీ అది అక్కడ సంప్రదాయమట!

ప్రస్తుత దైనందిత జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది ఓ భాగం అయిపోయింది.దాంతో పాటు సెల్ఫీలు కూడా ఎక్కువైపోయాయి.

 Have You Ever Taken Selfies With Corpses But It Is A Tradition There, ,selfie ,-TeluguStop.com

అవసరమైనదానికి, అవసరం లేనిదానికి కూడా యువత ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటోంది.ఈ క్రమంలో ఎన్నో ప్రమాదాలు కూడా జరగడం మనం చూస్తున్నాం.

సెల్ ఫోన్ కంపెనీలు కూడా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ లో ఫ్రెంట్ కెమెరాని చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు.అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాదిరి సంప్రదాయలు ఉంటాయి.

వాటికి అనుగుణంగానే ప్రజలు బతుకుతూ వుంటారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వింత సంప్రదాయపు కట్టుబాటు ట్రెండ్ అవుతోంది.

అదే శవాలతో సెల్ఫీలు తీసుకొనే సంప్రదాయం.ఇండోనేషియాలోని దక్షిణ సులవేసి ప్రాంతానికి చెందిన టోర్జా తెగవారు ప్రతి ఏటా చనిపోయిన తమ బంధువుల శవాలను తవ్వితీసి వారితో సమయాన్ని గడుపుతారు.

అంతేకాకుండా వారితో ఫోటోలు కూడా దిగుతారట.అయితే దీని వెనుక వున్న ఓ సంప్రదాయాన్ని గురించి వారు చెబుతున్నారు.

మరణించిన వారు, తమ కుటుంబ సభ్యులతో కలిసి జీవించి ఉన్న జ్ఞాపకాలను గుర్తుంచుకోవడానికి ఇదొక గొప్ప మార్గమని ఈ తెగవారి నమ్మకం.

Telugu Corpses, Indonesia, Selfie, Sulawesi, Traditional, Tribe Torja, Latest-La

అందువల్ల ప్రతి ఏట ఈ ఆగష్టు నెల వచ్చేసరికి పాతిపెట్టిన మృతదేహాలను బయటకు తీసి వారికి కొత్త బట్టలు ధరించి, సిగరెట్ ఇచ్చి, వారితో సెల్ఫీలు తీసుకుంటుంటారు.అంతేకాదు వారితో మాట్లాడినట్లు కూడా నటిస్తారట.‘మనేనే’ అని పిలిచే ఈ ఆచారం టోర్జా తెగ ప్రజలకు ఒక చక్కటి కుటుంబ అనుభవం.కాబట్టి ఈ తెగవారు చనిపోయిన వారి బంధువుల మృతదేహాలకు అంత్యక్రియలు జరిగే వరకు వారిని వారాలు, నెలల తరబడి ఇంట్లోనే ఉంచుకుంటారట.ఈ క్రమంలో వారికి ఆహారం తినిపించడం, వారితో సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా చేస్తారట.

అయితే ఈ మృతదేహాలను ఫార్మాలిన్‌లో భద్రపరచడం ద్వారా కుళ్లిపోకుండా ఉంటాయని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube