వైరల్: కొండచిలువ వేట ఎలా ఉంటుందంటే..!?

ప్రతి నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వేల సంఖ్యలో వీడియోలు హల్చల్ చేస్తూనే ఉంటాయి.ఈ మధ్య మరి ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే వీక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

 Have You Ever Seen The Hunting Of Python Viral, Huge,python,swallowing,deer, Vir-TeluguStop.com

మనకి తెలియని, మనం మునుపెన్నడూ చూడని వింతలు, విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు కాస్త వైరల్ అయ్యి సోషల్ మీడియా స్థాయిని మరి కాస్త పెంచుతున్నాయి.మరి నెటిజన్లు బాగా మెచ్చిన ఒక కొండచిలువ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

సాధారణంగా మనం పాములను చూస్తేనే భయపడి ఒణికిపోతుంటాము కదా.మరి అలాంటిది పాము జాతికి చెందిన ఒక పెద్ద అనకొండ లేదా పైథాన్ అనే పిలవబడే పామును చూస్తే ఎంతటి వారికైనా గుండెల్లో దడ పుట్టడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

ఎందుకంటే పైథాన్ వేట ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము.గతంలో కూడా కొండచిలువలకు సంబంధించిన చాలా వీడియోలను మనం చూసే ఉంటాము.అది వేట మొదలుపెట్టిందంటే ఆ రోజు ఏదో ఒక జంతువుకు మూడినట్లే.అనకొండ మనిషిని సైతం ఇట్టే మింగేయగలదు.

ఇంకా జంతువులు ఒక లెక్కా చెప్పండి.ఏ జంతువును అయిన సరే దాన్ని చుట్టేసి ఉక్కిరి బిక్కిరి ఆడనివ్వకుండా క్షణాల్లో చంపి మింగేస్తుంది.

అడవుల్లో మాత్రమే తిరిగే కొండచిలువ ఒక్కసారిగా జనాలు తిరిగే ప్రాంతాల్లో కనిపిస్తే ప్రజలు బెంబేలెత్తిపోతారు కదా.మరి అలాంటి కొండచిలువ ఒక జింకను వేటాడే తీరు చూస్తే మీరు షాక్ అవటం ఖాయం.కొండచిలువ వేటాడితో ఎంత భయంకరంగా ఉంటుందో ఈ వీడియోలో మనం చూడవచ్చు.

ఎక్కడో ఒక అటవీ ప్రాంతంలో ఓ కొండచిలువను స్థానికులు చూసినట్లుగా ఈ వీడియో చూస్తే మనకి అర్ధం అవుతుంది.మరి కొండచిలువే జింకను చంపిందో లేక చనిపోయి ఉన్నా జింకను కొండచిలువను జింకకు ఆహారంగా వేసారా అనే విషయం అయితే క్లారిటీ లేదు కానీ.కొండచిలువ ముందు మాత్రం ఒక చనిపోయిన జింక కళేబరాన్ని దానికి ఆహారంగా వేయడం మనం వీడియోలో చూడవచ్చు.

ఇంకేముంది కళ్ళముందు కడుపు నింపే ఆహారం కనిపిస్తుంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి.ఈ అనకొండ కూడా రెచ్చిపోయి ఒక్కసారిగా ఆ జింక కళేబరాన్ని అమాంతం దాని నోటితో లాక్కుని మింగేసింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.అనకొండ ఇలా జంతువులను మింగటాన్ని సినిమాల్లోనే చూసిన నెటిజన్లు ఇలా రియల్ గా జింకను మింగడం చుసిన నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube