Red cobra video : ఎరుపు రంగు నాగుపామును ఎప్పుడైనా చూశారా.. వీడియో వైరల్..

రీసెంట్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఆన్‌లైన్ యూజర్ల దృష్టిని ఆకర్షించింది, ఇందులో నాగుపాము లాంటి ఒక ఎరుపు రంగు పాము( red snake ) కనిపించింది.

రక్తపు రంగులో ఉన్న ఈ పామును చూస్తుంటే చాలా చిత్రంగా అనిపించింది.

సాధారణంగా పాములు నల్లగా, తెల్లగా లేదంటే బ్రౌన్ కలర్‌లో ఉంటాయి.కానీ ఈ పాము చాలా ఎర్రగా వెరైటీగా కనిపించింది.

వీడియోలో, ఒక వ్యక్తి ఈ ఎర్రటి పామును హ్యాండిల్ చేస్తూ కనిపించాడు, అది నాగుపాము వలే దాని పడగ విప్పి కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది.

ఈ వీడియోలో కనిపించిన పాము నిజంగా ఎర్రగానే ఉందా? ఇది అసలు పామేనా? లేదంటే ఫేక్ స్నేకా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.ఈ వీడియో యూజర్లలో చర్చనీయాంశమైంది.కొందరు ఇది నిజం కాదని అపనమ్మకాన్ని వ్యక్తం చేశారు, ఈ వీడియో ఎడిటెడ్ అనుకుంటా అని మరికొందరు సందేహం వ్యక్తం చేశారు.

Advertisement

ఏది ఏమైనప్పటికీ, ఈ వీడియోలోని ఎర్ర నాగుపాము, ఒక అసాధారణమైన దృశ్యంగా, మిస్టరీగా మిగిలిపోయింది.సోషల్ మీడియాలోని మరికొందరు క్రియేటర్స్ ఈ వీడియోను అలా కనిపించేలా చేసి ఉండొచ్చని అన్నారు.

ఒక వినియోగదారు ఎర్రటి నాగుపాముల ఉనికిని ధృవీకరిస్తూ అటువంటివి అరుదుగా కనిపిస్తాయని అన్నాడు.

ఈ పాము విలక్షణమైన రెడ్ స్పిట్టింగ్ కోబ్రా( Red Spitting Cobra ) అని తెలిపాడు.ఈ జాతి పాములు ఈజిప్ట్, టాంజానియా, ఉగాండా, సూడాన్‌లతో సహా అనేక ఆఫ్రికన్ ప్రాంతాలలో కనిపిస్తుంటాయి.ఈ రెడ్ స్పిట్టింగ్ కోబ్రా ఒక ప్రత్యేకమైన విషాన్ని ఉమ్మివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ లక్షణం ఇవి చాలా ఎలా క్రితమే అభివృద్ధి చేసుకొని ఉంటాయని భావిస్తున్నారు.ఈ నాగుపాము 8 అడుగుల దూరం నుంచి మానవుల కళ్ళలోకి కచ్చితంగా విషాన్ని ఉమ్మివేయగలవు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?

అలాంటి పరిస్థితులలో ప్రాణాలకు చాలా ప్రమాదం.అందుకే వీటికి దూరంగా ఉండాలని చెబుతారు.

Advertisement

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు