న‌డిరోడ్డుపైనే సింహాల వేట ఎప్పుడైనా చూశారా..

మ‌న‌కు ఇంటర్నెట్‌లో క్రూర‌మృగాల‌కు సంబంధించిన వీడియోలు కోకొల్లలుగా క‌నిపిస్తాయి.ఎందుకంటే వేట అంటేనే అంత క్రేజ్ ఉంటుంది మ‌రి.

 Have You Ever Seen A Lion Hunt On On Road, Lion Hunt, Viral Video, Lions Hunting-TeluguStop.com

ఇక వైల్డ్ లైఫ్ అంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది కాబ‌ట్టి క్రూర మృగాల వేటకు అంత క్రేజ్ ఉంటుంది మ‌రి.ఇలాంటి వీడియోలకు మిలియ‌న్ల‌ల‌లో వ్యూస్ వ‌స్తున్నాయంటే వాటి స్థాయి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక క్రూర మృగాల్లో మ‌రీ ముఖ్యంగా సింహం లేదంటే పులుల‌కు సంబంధించిన వాటికి ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఉంటుంది.ఎందుకంటే ఈ జంతువులు త‌మ ఎరను పట్టుకోవడంలో చూపించే తెలివి అమోఘం.

అవి త‌మ ఎర‌ను డిసైడ్ చేసుకున్నాయంటే గ‌న‌క దాన్ని త‌మ ఆహారంగా మార్చుకునేంత వ‌ర‌కు నిద్ర‌పోవు.ఇక ఇలాంటి వేట గురించే ఇప్పుడు ఓ వీడియో వైర‌ల్ అవుతోంది.

అయితే ఎప్పుడైనా జంతువుల వేట మ‌న‌కు అడ‌విలో క‌నిపిస్తుంది.కానీ అవే సింహాలు రోడ్డుపై వేటాడితే ఇంకేమైనా ఉందా.

ఇలాంటివి మ‌రింత వైర‌ల్ అవుతంటాయి క‌దా.ఇక ఇప్పుడు మ‌నం చెప్పున‌కోబోయే వీడియోలో కూడా ఓ ఆవుపై రెండు సింహాలు దారుణంగా మెరుపు దాడితో వేటాడ‌టం మ‌న‌కు క‌నిపిస్తుంది.

కాగా అవి వేటాడింది న‌డిరోడ్డు మీద కావ‌డంం గ‌మ‌నార్హం.

అయితే ఈ ఘ‌ట‌న గుజరాత్‌లోని జునాఘడ్ ప‌ట్ట‌ణంలో జ‌రిగింది.ఈ ప‌ట్ట‌ణంలో స‌డెన్‌గా రెండు సింహాలు నడిరోడ్డుపై ద‌ర్శ‌న‌మిచ్చాయి.ఇక ఆ రోడ్డుపై వెళ్తున్న ఆవును అమాంతం వేటాడే వీడియో ఇప్పుడు నెట్టింట వెలుగులోకి రావ‌డం మ‌నం చూడొచ్చు.

ఇక అక్క‌డే కార్ల‌లో జనాలు కూడా ఉన్నారు.వారంతా చూస్తుండ‌గానే సింహాల వేట కొన‌సాగింది.అయితే ఆవు కూడా వాటి బారి నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి బాగానే ట్రై చేస్తుంది.కానీ అక్క‌డ ఉన్న‌వి సింహాలు క‌దా విడిచిపెడుతాయా.

ఆ భీకర పోరాటంలో ఆవు త‌న ప్రాణాల‌ను కోల్పోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube