చంద్రుడి మీద నుంచి చూస్తే భూమి ఎలా కనిపిస్తుందో ఎప్పుడన్నా గమనించారా?

చంద్రుడి( moon ) మీద అనేక పరిశోధనలు జరిగాయి, నేటికీ జరుగుతున్నాయి.వందల సంవత్సరాల నుంచి ప్రపంచ శాస్త్రవేత్తలు, మేధావులు చంద్రుడి గురించి అనేక కొత్త విషయాలు తెలుసుకునేందుకు యత్నిస్తూనే ఉన్నారు.

 Have You Ever Noticed What The Earth Looks Like From The Moon, Have You Ever, La-TeluguStop.com

ఈ క్రమంలోనే అనేక దేశాలు చంద్రుడి మీదకు మానవ రహిత, మానవ సహిత వ్యోమనౌకలను పంపి పరిశోధనలు ముమ్మురంగా కొనసాగిస్తున్నాయి.ఇక ఇటీవల భారత్ కూడా చంద్రయాన్-3( Chandrayaan-3 ) ద్వారా చంద్రుని అన్వేషణలో నిమగ్నమైంది.

అయితే, చంద్రుడి మీద ఇన్ని పరిశోధనలు జరిగినా, చంద్రుడి గురించి తెలియని కొన్ని కీలక విషయాలు ఎన్నో ఉన్నాయి.

Telugu Latest, Moon, Noticed, Ups, Earth-Latest News - Telugu

అందులో మొదటి అంశం “చంద్రుడు గుండ్రంగా లేడు” అనేది.సాధారణంగా మనకు కనిపించే ఫొటోలలో, బొమ్మల్లో కూడా చంద్రుడు గుండ్రంగా ఉన్నట్లే కనిపిస్తాడు.కానీ, నిజానికి ఉపగ్రహమైన చంద్రుడు బంతిలాగా గుండ్రంగా ఉండడు.

చంద్రుడి ఆకారం ఓవల్ షేప్ అంటే గుడ్డు లేదంటే బాదంపండు ఆకారంలో ఉంటాడు.ఈ ఆకారం వల్లనే భూమి మీద నుంచి చంద్రుడిని పూర్తిగా మనం చూడలేము.

ఇక రెండవ అంశం “చంద్రుడిని పూర్తిగా చూడలేం!” అనేది.మనం చంద్రుడిలో గరిష్టంగా 59% ప్రాంతాన్ని మాత్రమే చూడగలం.

మిగతా 41% చంద్రుడు మనకు కనిపించనే కనిపించడు.చంద్రుడి మీదకు వెళ్లి ఆ 41% ప్రాంతంలో ఉండి చూస్తే, మనకు భూమి అస్సలు కనిపించదు మరి.

Telugu Latest, Moon, Noticed, Ups, Earth-Latest News - Telugu

ఇక ముఖ్యమైన 3వ అంశం ‘బ్లూ మూన్’( Blue Moon )కు అగ్నిపర్వతాల పేలుళ్లకు లింక్ ఉందనేది.చంద్రుడు అప్పుడప్పుడు నీలి రంగులో కనిపిస్తాడనే విషయం విదితమే.దాన్ని బ్లూ మూన్‌ అని అంటుంటారు.వాస్తవానికి చంద్రుడి రంగులో మార్పు ఏమీ ఉండదు.కానీ కొన్ని వాతావరణ పరిస్థితులు కారణంగా చంద్రుడు మనకు కళ్లకు నీలి రంగులో కనిపిస్తాడు.ఇక నాల్గవ అంశం “చంద్రుడిపై సీక్రెట్ ప్రాజెక్ట్.”( Secret Project on the Moon ) దాదాపు అన్ని దేశాలు అక్కడ పాగా వేయాలని చూస్తున్నాయి.ఈ తరుణంలోనే ఇలాంటి ప్రాజెక్ట్స్ షురూ చేస్తున్నాయి.

చంద్రుడి మీదకు మానవ సహిత వ్యోమనౌకలను పంపించడం 1960 తర్వాతనే సాధ్యమైంది.అయితే అంతకు ముందే, చంద్రుడి మీద అణుబాంబును పేల్చాలని అమెరికా ఒక సీక్రెట్ ప్రాజెక్టును నడిపింది భోగట్టా.

అయితే దీనిపైన సరియైన అధరాలు లేవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube