ఇది విన్నారా.. కోతులు కూడా కిడ్నప్ చేస్తాయట..!

Have You Ever Listened That Monkeys Can Also Do Kidnap

మనుషులు మనుషులను, లేదా జంతువులను కిడ్నాప్ చేయడం మనం చూస్తూ ఉంటాము.డబ్బు కోసమో, లేక వారి మీద కోపంతోనో, వాళ్లని ఏడిపించడానికో మనుషులు, మనుషులను లేదా జంతువులను కిడ్నాప్ చేస్తూ ఉండడం సహజం.

 Have You Ever Listened That Monkeys Can Also Do Kidnap-TeluguStop.com

అయితే జంతువులు కిడ్నాప్ చేయడం మీరెప్పుడైనా చూశారా.? మనుషులు మాత్రమే కాదు తాము కూడా కిడ్నాప్ చేయగలరని నిరూపించింది ఓ కోతి.

ఎందుకు కోపం వచ్చిందో, ఎవరి మీద కోపం వచ్చిందో, ఎవరిని ఏడిపించాలనుకుందో, ఎందుకోసం చేసిందో తెలియదు గానీ, మలేషియాలోని తమన్ లేస్టారి పుత్రలో ఓ కోతి ఒక చిన్న కుక్క పిల్లని కిడ్నాప్ చేసి మూడు రోజులపాటు తన వద్దనే ఉంచుకొని స్థానికులకు చుక్కలు చూపించింది.రెండు వారాల వయసున్న చిన్న కుక్కపిల్లను కిడ్నాప్ చేసి ఎవరికి కనిపించకుండా, అడవిలోకి తీసుకెళ్లి చెట్లను ఎక్కి దాచేసింది.

 Have You Ever Listened That Monkeys Can Also Do Kidnap-ఇది విన్నారా.. కోతులు కూడా కిడ్నప్ చేస్తాయట..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిన్న కుక్క పిల్లను తన వీపు మీద వేసుకుని ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకు వెళ్తున్నా ఏ మాత్రం ఆ కుక్క పిల్లను వదల్లేదు.

దీంతో ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, అక్కడి ప్రజలు ఆ కుక్క పిల్లను విడిపించేందుకు నానా తంటాలు పడ్డారు.

Telugu Kidnapped, Latest, Malaysia, Monkeykidnapped, Monkeys, Monkeys Kidnap, Latest-Latest News - Telugu

కోతి నుండి కుక్క పిల్లను విడిపించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.అయినా కూడా ఫలితం లేకపోయింది.అలా మూడు రోజులు పాటు విశ్వ ప్రయత్నం చేయగా మూడవ రోజు ఎట్టకేలకు కుక్క పిల్లను కోతి నుండి కాపాడగలిగారు.దీంతో స్థానికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

#MonkeyKidnapped #Malaysia #MOnkeys #Kidnapped #Monkeys Kidnap

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube