ఈ టూత్ పేస్ట్ కాఫీ గురించి మీరెప్పుడైనా విన్నారా..

Have You Ever Heard Of This Toothpaste Coffee

ఈ మ‌ధ్య డిఫ‌రెంట్ ఫుడ్ ఐట‌మ్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతుండ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం.రోజూ రొటీన్ ఫుడ్ ఐట‌మ్స్ తిని తిని బోర్ కొడుతుందో ఏమో తెలీదు గానీ చాలామంది ఈ మ‌ధ్య‌న వెరైటీ వంట‌కాల‌ను ట్రై చేస్తున్నారు.

 Have You Ever Heard Of This Toothpaste Coffee-TeluguStop.com

ఏదో ఒక కొత్త వంట‌కాన్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తూనే ఉన్నారు.మొన్న‌టికి మొన్న చింత‌పండు ర‌స‌గుల్లాను కూడా మ‌నం చూశాం.

ఇలా ఎక్క‌డో చోట ఎవ‌రో ఒక‌రు ఇలా వెరైటీ వంట‌కాల‌ను త‌యారు చేస్తూనే ఉన్నారు.ఇప్పుడు కూడా ఇలాంటి వంట‌కం ఒక‌టి వైర‌ల్ అవుతోంది.

 Have You Ever Heard Of This Toothpaste Coffee-ఈ టూత్ పేస్ట్ కాఫీ గురించి మీరెప్పుడైనా విన్నారా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాఫీ అంటే ప్ర‌జ‌ల‌కు ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ప్రొద్దున్నే వేడి వేడి కాఫీ తాగితే వ‌చ్చే అనుభూతి ఇంకెందులోనూ రాదేమో.అయితే కాఫీ అంటే కాఫీ పొడితేనే త‌యారు చేస్తార‌న్న విష‌యం మ‌న‌కు తెలుసు క‌దా.కానీ ఇప్పుడు ఓ వ్య‌క్తి మాత్రం ఏకంగా టూత్పేస్ట్ తో కాఫీని రెడీ చేశాడు.

విన‌గానే ఆశ్చ‌ర్య‌పోతున్నారు క‌దా.కానీ మీరు విన్న‌ది నిజ‌మే.

ఓ వ్య‌క్తి ఏకంగా టూత్ పేస్ట్‌తో కాఫీని రెడీ చేయ‌డాన్ని చూసి అంతా పరేషాన్ అవుతున్నారు.ఈ వైర‌ల్ వీడియోలో అత‌ను టూత్పేస్ట్‌ను తీసుకుని దాన్ని త‌న ద‌గ్గ‌రున్న మిక్సీలో వేస్తాడు.

దాన్ని ద్ర‌వ‌రూపంలోకి వ‌చ్చేలా మిక్స్ చేస్తాడు.ఇందులో కొన్ని పాల‌ను కలుపుతాడు.ఆ త‌ర్వాత వాటిలో కొన్ని పిప్పరమింట్ బిళ్లలను వేసి బాగా క‌లుపుతాడు.ఇలా టూత్ పేస్ట్‌ను కాఫీలో చిక్క‌గా క‌లుపుకుని దాన్ని ఒక గ్లాసులో పోసుకొని తాగేందుకు రెడీ చేస్తాడు.

కొంచెం చెక్క‌ర వేసి చివ‌ర‌గా క‌లుపుకుని మొత్తం ద్రావ‌ణాన్ని కాఫీలా చేసుకుని తాగేస్తాడు.అయితే అది అద్భుతంగా ఉందంటూ బదులిస్తాడు.

దీన్నంతా కూడా వీడియో తీసి నెట్టింట షేర్ చేయ‌గా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.దాన్ని చూసిన వారంతా కూడా రకరకాల కామెంట్స్ పెట్టేస్తున్నారు.

#HeardToothpaste

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube