పదో విడత పీఎం కిసాన్ డబ్బులు అందలేదా.. అయితే అర్జెంట్‌గా ఇలా చేయండి..!

ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద 10.9 కోట్ల భారతీయ రైతులకు 10వ విడత డబ్బులు జమ చేసిన విషయం తెలిసిందే.ఆర్థిక సాయంగా మొత్తంగా కేంద్రం రూ.20,900 కోట్లకు పైగా నిధులను రిలీజ్ చేసింది.అర్హులైన లబ్ధిదారులందరూ ఈ పథకం ద్వారా ఏటా రూ.6,000 పొందుతున్నారు.అయితే అర్హత ఉన్నా కొందరు రైతన్నలకు 10వ విడతలో డబ్బులు జమ కాలేదు.ఇందుకు కొన్ని తప్పులు కారణాలు అయ్యుండొచ్చు.నగదు అందకపోతే అన్నదాతలు అర్జెంట్‌గా ప్రభుత్వం జారీ చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌కు కంప్లైంట్ ఇవ్వచ్చు.లేదంటే స్థానిక అకౌంటెంట్ లేదా వ్యవసాయ అధికారి ని సంప్రదించవచ్చు.

 Have You Dont Get Tenth Installment Of Pm Kisan Money Then Do This Immediately D-TeluguStop.com

డబ్బులు ఎందుకు జమకాలేదు అనేది వీళ్లు పరిశీలించి మీకు తెలియజేస్తారు.

కిసాన్ సమ్మాన్ నిధి ఇన్‌స్టాల్‌మెంట్ మీ బ్యాంకు ఖాతాలో జమ కాలేదని చెబుతూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ హెల్ప్‌లైన్ నంబర్‌ కు మీరు ఫోన్ చేసి తెలియజేయవచ్చు.

మీరు హెల్ప్‌లైన్ నంబర్ 011 24300606 / 011 23381092 ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేస్తే సరిపోతుంది.ఫోన్ కాల్ వద్దనుకుంటే రైతన్నలు సోమవారం నుంచి శుక్రవారం మధ్య ప్రధానమంత్రి రైతులు హెల్ప్ డెస్క్, ఈ-మెయిల్ pmkisan ict@gov.in మెయిల్ చేస్తే సరిపోతుంది.

Telugu Amount, Credit, Financial, Indian Farmers, Latest, Pm Kisan, Pmkisan, Ten

నిజానికి ప్రభుత్వం అర్హత ఉన్న అన్నదాతలకు లబ్ధి చేకూర్చాలని అందరి అకౌంట్లకు డబ్బులు జమ చేస్తుంది.కానీ కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ప్రభుత్వం పంపించిన సొమ్ము మధ్యలోనే ఆగిపోతుంది.మీ ఆధార్, బ్యాంక్ ఖాతా నంబర్‌లో తప్పులు నమోదు చేయడం వల్లే ఎక్కువగా డబ్బులు రాకుండా అలాగే ఆగిపోతున్నాయి.అందుకే మళ్లీ అన్నదాతలు పీఎం కిసాన్ పథకం కోసం తాము పొందుపరిచిన సమాచారం సరి చూసుకుంటే మంచిది.

బెనిఫిషరీ స్టేటస్ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube