ఆ ప‌ని చేసి జ‌గ‌న్ టార్గెట్ పూర్తి చేసుకున్నారా..

రాజ‌కీయంగా ఎన్ని సాధించాలన్నా వారి చేతుల్లోనే ఉంటుంది కానీ ప్ర‌భుత్వ ప‌రంగా అనుకున్న‌వ‌న్నీ సాధించాలంటే మాత్రం కుద‌ర‌ని ప‌ని.ఎందుకంటే దానికి కేంద్రం నుంచి స‌హాయ‌, స‌హ‌కారాలు అందాలి.

 Have You Done That And Completed The Jagan Target, Jagan, Ap Politics-TeluguStop.com

లేక‌పోతే మాత్రం అనుకున్న‌వ‌న్నీ, లేదా ఇచ్చిన హామీలు అన్నీ నెర‌వేర్చుకోవ‌డం పెద్ద స‌మ‌స్య‌గానే మారిపోతుంది.అయితే ఏపీ విష‌యానికి వ‌స్తే విభ‌జ‌న హామీలు, ప్ర‌త్యేక లాంటివి హామీలు జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన మాట విదిత‌మే.

వాటిని సాధించేందుకు ఆయ‌న ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా కేంద్రం నుంచి మాత్రం పెద్ద‌గా రెస్పాన్స్ రావ‌ట్లేదు.

ఇదే విష‌యాన్ని ఆయ‌న గ‌తంలో చాలాసార్లు అమిత్ షా, మోడీల‌కు ప‌దే ప‌దే వివ‌రించినా పెద్ద‌గా ఫ‌లితం లేకుండా పోతోంది.

దీంతో విసిరి వేసారిపోయిన జ‌గ‌న్ ఈ సారి త‌న వంతుగా ఎంత చేయాలో అంత చేయాల‌నుకున్న‌ట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగానే మొన్న అమిత్ షా అధ్య‌క్ష‌త‌న తిరుప‌తిలో జ‌రిగిన ద‌క్షిణాది రాష్ట్రాల స‌మావేశానికి జ‌గ‌న్ స్వ‌యంగా వెళ్లారు.

అయితే ఈ స‌మావేశానికి వ‌చ్చిన సీఎంలు, గ‌వ‌ర్న‌ర్ల ముందే జగన్ గ‌తంలో త‌మ‌కు ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించారు.దీన్ని బ‌ట్టి చూస్తుంటే తాను ఏపీ కోసం ఎంత చేయాలో అంత చేస్తున్నాన‌నే సంకేతాలు ఇచ్చేశార‌న్న‌మాట‌.

Telugu Amith Shah, Ap Cm Jagan, Ap, Jagan Target, Jagan, Narendara Modi, Ysrcp-T

కేంద్రం చేతిలో ప‌ని ఉండ‌టం వ‌ల్ల వారు చేయ‌ట్లేద‌నే విష‌యాన్ని రాబోయే కాలంలో జ‌గ‌న్ చెప్పేందుకు ఆస్కారాన్ని క‌ల్పించుకుంటున్నారు.ఇక జ‌గ‌న్ ఎంత‌లా చెప్పాలో అంత‌లా చెప్పేశాన‌ని, ఇక ప‌ని మొత్తం అమిత్ షా చేతిలోనే ఉంద‌ని తేల్చేశారు.కానీ నరేంద్ర మోడీ చెప్ప‌నిది ఏమీ కాద‌న్న విష‌యం జ‌గ‌న్‌కు కూడా తెలియ‌నిది కాదు.ఆయ‌న అనుగ్ర‌హం లేకుండా షా కూడా ఏమీ చేయ‌లేడు.కానీ న‌రేంద్ర మోడీని ఇంత‌మంది సీఎంల స‌మ‌క్షంలో అడిగే అవ‌కాశం జ‌గ‌న్‌కు రాదు.అందుకే వ‌చ్చిన మంచి అవ‌కాశాన్ని వినియోగించుకున్నార‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube