మీరు కోవి షీల్డ్ వాక్సిన్ వేయించుకున్నారా.. అయితే మీకొక గుడ్ న్యూస్.. !!

కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కొంతమంది అయితే ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు.

 Have You Been Vaccinated Against Gunpowder Shield .. But Good News For You Covi-TeluguStop.com

ఇప్పటికీ కరోనా వైరస్ మన దేశాన్ని వదిలి వెళ్లిపోలేదు.వేరు వేరు వేరియంట్స్ తో రూపాంతరం చెంది అంతకన్నా రెట్టింపు వేగంతో దూసుకు వస్తుంది.

కరోనా వైరస్ పేరు చెప్తే చాలు ఎవరి గుండెల్లో అయిన భయం మొదలవుతుంది.ఈ క్రమంలో కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించే ఉద్దేశంతో మన ప్రభుత్వాలు టీకాలను అందుబాటులోకి తీసుకుని వచ్చాయి.

ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సీన్ వేపించుకోవాలి అని, అప్పుడే కరోనా నుంచి ముప్పు తగ్గుతుందని సూచించారు.

కరోనాకు ఇప్పుడు అందరు కూడా కోవి షీల్డ్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.

ఈ వ్యాక్సీన్ ను ఆక్స్​ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంస్థలు కలిసి తయారు చేసిన విషయం మనకు తెలిసిందే.పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేస్తుంది.

కాగా ఇప్పుడు కోవి షీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్ కి రెండవ డోస్ కి మధ్య వ్యవధి 84 రోజులుగా ఉంది.కోవి షీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న మొదటి రోజు నుండి సరిగ్గా 84 రోజులు వరకు రెండవ డోస్ వ్యాక్సిన్ వేయటం లేదు.

అయితే ఇప్పుడు ఇప్పుడు రెండు రోజుల మధ్య ఉన్న వ్యవధిని తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.NTAGI కమిటీ త్వరలో ఈ విషయం పై చర్చించి ఒక నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.

Telugu Covishield, Days, Doses, Ntagi-Latest News - Telugu

ఈ ఏడాది ప్రారంభంలోనే కోవి షీల్డ్ వ్యాక్సినేషన్ వేసే అప్పుడు రెండు డోసుల మధ్య వ్యవధి 6-8 వారాల వరకు మాత్రమే ఉండేది.తరువాత మే నెలలో 12-16 వారాలకు రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచారు.మొదటి డోస్ కి, రెండవ డోస్ కి మధ్య వ్యవధి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా వాక్సిన్ పని చేస్తుందని నేషనల్‌ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ NTAGI నిపుణుల బృందం స్పష్టం చేసింది.ఈ బృందం ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేంద్రం కూడా రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచింది.

మళ్ళీ ఇప్పుడు అనుకూలమైన ఫలితాలు వస్తే గనుక మరికొద్ది రోజుల్లో కోవి షీల్డ్ వాక్సిన్ డోస్ విషయంలో మార్పు రావచ్చు అని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube