అవి దెయ్యాలు సంచరించే వీధులు... ఎక్కడున్నాయంటే..

Haunted Roads In India Where Ghosts Roam Details, Ghosts, Ghost Streets, Haunted, Haunted Areas, Interesting Facts, Satya Mangalam Wild Life Sanctuary, Chennai, Blue Cross Road, Delhi Cantonment Road

సినిమాల్లో భయానకమైన రోడ్లను చూపిస్తుంటారు.మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భయానక రోడ్లు ఉన్నాయని మీకు తెలుసా? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Haunted Roads In India Where Ghosts Roam Details, Ghosts, Ghost Streets, Haunted-TeluguStop.com

ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్

ఢిల్లీలోని ఈ రహదారి హంటెడ్‌గా పరిగణిస్తారు.రాత్రి సమయంలో ఇక్కడ తెల్లటి చీరలో ఒక మహిళ కనిపిస్తుందని స్థానికులు చెబుతుంటారు.

అయితే ఇప్పటి వరకు ఇటువంటి స్త్రీని ఎవరూ చూడలేదు.అయితే రాత్రి సమయంలో ఈ రహదారిని దాటడానికి ఎవరూ సాహసించరు.

స్టేట్ హైవే-NH49, ఈస్ట్ కోస్ట్ రోడ్

దీనిని ఈస్ట్ కోస్ట్ రోడ్ అని కూడా పిలుస్తారు.ఇది రెండు లైన్ల రహదారి.

ఇది పశ్చిమ బెంగాల్‌ను తమిళనాడుతో కలుపుతుంది.చెన్నై- పాండిచ్చేరి మధ్య ఉన్న ఈ మార్గాన్ని హంటెడ్‌గా పరిగణిస్తారు.రాత్రిపూట తెల్ల చీర కట్టుకున్న మహిళ అకస్మాత్తుగా కనిపిస్తుందని ఈ మార్గం గుండా వెళ్లే పలువురు డ్రైవర్లు చెబుతుంటారు.2-లేన్ ఈస్ట్ కోస్ట్ రోడ్ చెన్నై సముద్ర తీరం వెంబడి ఉంటుంది.చెన్నైని కడలూరు పుదుచ్చేరితో కలుపుతుంది.

బ్లూ క్రాస్ రోడ్, చెన్నై

చెన్నైలోని బసంత్ నగర్‌లోని బ్లూ క్రాస్ రోడ్ చెన్నైలో అత్యంత హంటెడ్ రోడ్‌గా పరిగణిస్తారు.ఈ ప్రదేశం హంటెడ్‌గా పరిగణించబడటానికి కారణం ఇక్కడ జరిగే ఆత్మహత్యలు.ఈ ఆత్మహత్యల తరువాత, మృతుడి ఆత్మ ఈ రహదారిపై బాటసారులను కలవరపెడుతుంది.

ఇక్కడ దట్టమైన చెట్లు, తీగలు ఉండడం వల్ల ఈ ప్రదేశం పగటిపూట కూడా చాలా భయానకంగా కనిపిస్తుంది.తెల్లటి దుస్తులలో ఒక జీవి ఈ ప్రదేశంలో సంచరించడం చూశామని స్థానికులు చెబుతుంటారు.

సత్యమంగళం వైల్డ్ లైఫ్ సెంచరీ కారిడార్-NH209

సత్యమంగళం వన్యప్రాణుల అభయారణ్యం చేరుకోవడానికి ఈ కారిడార్ మీదుగా వెళ్లాలి.ఇక్కడ ఒకప్పుడు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పాలన ఉండేది.వీరప్పన్ మరణానంతరం అతని ఆత్మ ఇక్కడ సంచరిస్తోందని స్థానికులు నమ్ముతారు.చాలా మంది ప్రజల వాదన ప్రకారం, ఇక్కడ ఒక వ్యక్తి దెయ్యంగా కనిపిస్తాడంటారు.

Haunted Roads In India Where Ghosts Roam Details, Ghosts, Ghost Streets, Haunted, Haunted Areas, Interesting Facts, Satya Mangalam Wild Life Sanctuary, Chennai, Blue Cross Road, Delhi Cantonment Road - Telugu Blue Cross Road, Chennai, Delhi Road, Ghost Streets, Areas, Satyamangalam #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube