మంచునదిని కాపాడుకోవడానికి వారు చేసిన పనికి హ్యాట్సాఫ్..!

చాలా మందికి చలికాలం వచ్చిందంటే చాలు ఏవేవో భయాలు కలుగుతాయి.ఎంత ఎండకైనా తట్టుకోగలుగుతారు కానీ.

 Hatsoff To The Work They Did To Protect The Snow  Cover With A Tarpaulin, Ice ,-TeluguStop.com

చలి ఎక్కువైతే మాత్రం చాలా మంది తట్టుకోలేరు.చలివేసిందంటే చాలు వెంటనే దుప్పటి వేసుకోవాల్సిందే.

ఇదే విధంగానే ఇక్కడ కూడా చేశారు.వేడి వలన కరిగిపోతున్నటువంటి ఓ మంచు నదిని కాపాడుకునేందుకు ఆ ప్రాంత ప్రజలు ఓ గొప్ప పని చేశారు.

ఈనాటి రోజుల్లో వాతావరణ మార్పులు చెందుతున్న కారణంగా పర్యావరణంలో అనేక ఇబ్బందులనేవి కలుగుతున్నాయి.దీనివల్ల పర్యావరణ వేత్తలు కూడా చాలా భయపడుతున్నారు.

ఉత్తర ఇటలీలో ఈ మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువయ్యాయి.అధిక వేడి అనేది ఉండటం వలన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రెసేనా హిమనీనది కరిగిపోవడం అందర్నీ భయపెడుతోంది.

ఆ నదిని ఎలాగైనా కాపాడుకోవడానికి ఇటలీ వాతావరణ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.చివరికి ఓ గొప్ప ప్రయత్నం అయితే చేశారు.

మంచు కరగకుండా ఉండేందుకు వేడి వేడి సూర్య కిరణాలు పడకుండా ఉండేందుకు వారు మంచు నదిపైన ఎక్కువ మందంతో ఉన్న టార్సాలిన్ గుడ్డలను కప్పేందుకు కసరత్తు చేశారు. 120,000 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ నదిని కప్పేందుకు వారికి నెల రోజుల టైమ్ పట్టింది.1993 నుండి ప్రెసేనా హిమనీనది వేడి కారణంగా చాలా వరకూ తగ్గిపోతూ వచ్చింది.వేడి వలన ఒక భాగం మంచును నది కోల్పోయింది.

మంచునది కరిగిపోకుండా 2008వ సంవత్సరం నుండి ఇలా టార్ఫాలిన్ తో కప్పేందుకు ఇటలీ శాస్త్రవేత్తలు ఎంతో శ్రమిస్తున్నారు.ఇటువంటి విధానం అవలంభించడం వలన వారు మంచి ఫలితాన్ని పొందారు.

దీంతో శాస్త్రవేత్తలు హర్షిస్తున్నారు.శాస్త్రవేత్తలు ఇలా చేయడం ద్వారా వేడి కిరణాలు అనేవి మంచు నదిపైన పడకుండా ఉంటాయి.

దీంతో నదిని కాపాడుకోవచ్చు.ఏది ఏమైనా నదిని కాపాడుకోవడానికి వారు పెద్ద సాహసమే చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube