మెట్లపై నుండి జారీ పడిన సూపర్ స్టార్..! అందరిలో ఒకటే టెన్షన్..! చివరికి హాస్పిటల్ కి తరలింపు!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రఅనారోగ్యానికి గురయ్యారన్న వార్తల్లో వాస్తవం లేదని రజనీకాంత్ పీఆర్వో రియాజ్ వివరణ ఇచ్చారు.రజనీకాంత్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని, వదంతులు నమ్మొద్దని కోరారు.

 Hats Off To Rajinikanth Commitment For Work-TeluguStop.com

రజనీకాంత్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ తమిళనాడు వ్యాప్తంగా వాట్సాప్‌ గ్రూపుల్లో, ఫేస్‌ బుక్‌లలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది.రజనీకాంత్‌ ఆరోగ్యం క్షీణించిందని, ఆసుపత్రిలో చేరినట్టు వస్తున్న వార్తలను రజనీకాంత్ పీఆర్వో కొట్టిపడేశారు.మరోవైపు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన 2.0 చిత్రం న‌వంబ‌ర్ 29న విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది.

ఇది ఇలా ఉంటె…శంకర్ డైరెక్షన్ లో ‘2.ఓ’ సినిమా షూటింగ్ మహాబిలిపురంలో చేస్తున్న సమయంలో చిత్ర హీరో రజనీకాంత్ తీవ్రంగా గాయపడ్డారట.ఓ కీలక సన్నివేశంలో ఈ ప్రమాదం జరిగిందట.అయితే షాట్ పూర్తిచేసెయ్యమని రజనీ చెప్పారని ఓ ఇంగ్లీషు మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో దర్శకుడు శంకర్ వెల్లడించారు.‘మెట్లపైనుంచి జారిపడడంతో, రజనీ మోకాలికి తీవ్రంగా రక్తస్రావం అయింది.

ఈ సంఘటన గురించి నాకు ఎవరు చెప్పలేదు.

అయితే రజనీ నాదగ్గరకు వచ్చి షూటింగ్ కి అంతా సిద్ధమే కదా అని అడగడంతో ఓ సన్నివేశం గురించి వివరించాను.వెంటనే ఆయన మేకప్ రూమ్ కి వెళ్లారు’అని శంకర్ చెప్పుకొచ్చాడు.

అయితే సెట్లో అందరూ ఏదో కంగారుగా మాట్లాడుకోవడం చూసాను.ఈలోగా మేనేజర్ నా దగ్గరకు వచ్చి అసలు విషయం చెప్పడంతో నేను షాకయ్యను.

దగ్గరలో గల ఆసుపత్రికి తీసుకెళ్లాలని అనుకున్నాం.

కానీ షూటింగ్ అయ్యాకే అని రజనీ పట్టుబట్టారు.ఇంకా చాలా బతిమాలిన తర్వాత ఓ షాట్ పూర్తయ్యాక ఆసుపత్రికి వెళ్తాన్నారు.ఆవిధంగా ఓ షాట్ పూర్తిచేసి ఆసుపత్రికి తరలించాం.

అయితే అక్కడ విషయం తెలిసాక అందరం షాక్ తిన్నాం.ఎందుకంటే ఆయనకు తగిలిన దెబ్బ పెద్దదే.

అందుకే నెలరోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.కానీ రజనీ రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ పూర్తిచేయాలని చెప్పారు.

అది రజినీకాంత్ గారి కమిట్మెంట్ అంటే.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube