నీళ్ల డ్రమ్ ను ఏసీ కూలర్ గా.. ఇతని ఐడియాకు హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

ప్రస్తుత కాలంలో కొందరు వ్యక్తులు చేస్తున్న విన్నుత ఆవిష్కరణలు చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే.సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట కొత్త ఆవిష్కరణలు జరిగిన విషయలు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.

 Hats Off To His Idea Of ​​using A Water Drum As An Ac Cooler, Jugad Devices,-TeluguStop.com

కొన్ని విషయాల గురించి విన్నప్పుడు వాటిని నేరుగా కళ్ళతో చూసినంతవరకు నమ్మడం కష్టం.అలాంటి కోవకు చెందినదే ఈ విన్నుత ఆవిష్కరణ.

వేసవికాలం వచ్చిందంటే ఎండ తీవ్రత ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం మే నెల ముగిసి జూన్ నెల ప్రారంభమైన ఇంకా వేసవి ఎండ తీవ్రత తగ్గలేదు.ఇంకా ప్రజలందరూ కూలర్, AC ( Cooler, AC )లేకుండా ఉండలేని పరిస్థితి.ఇంట్లో చల్లని వాతావరణం ఉండాలని అందరూ కోరుకుంటారు.

అందుకోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి వివిధ రకాల విద్యుత్ యంత్రాలను కూడా కొనుగోలు చేస్తుంటారు.ఇక సోషల్ మీడియాలో ఎండ తీవ్రత, ఉక్కపోతకు చెక్ పెట్టే విధంగా అనేక రకాల జుగాడ్ పరికరాలు( Jugad devices ) తయారు చేసిన వీడియోలు చాలానే చూశాం.

కొందరు ఫ్యాన్ కు కవర్ తొడిగి చల్లటి గాలిని బంధిస్తే, మరికొందరు మట్టి పెంకులతో( clay shells ) కూలర్లు తయారు చేసిన విషయం తెలిసింది.

కానీ నీళ్ల డ్రమ్ ని AC కూలర్ గా మారిస్తే ఎలా ఉంటుందో తెలుసా.? ఓ వ్యక్తి ఈ AC కూలర్ తయారు చేశాడు.బయట మార్కెట్లో దొరికే కూలర్ల కంటే ఈ కూలర్ చల్లటి గాలిని ఇస్తుందట.

అచ్చం బయట దొరికే కూలర్ లాగా ఈ నీళ్ల డ్రమ్ ని కత్తిరించాడు.అందులో ప్లాస్టిక్ ఫ్యాన్, వాటర్ మోటర్, గడ్డి ( Plastic fan, water motor, grass )లాంటి అవసరమైన పరికరాలను అమర్చాడు.

తర్వాత ఆ డ్రమ్ ఏసికి విద్యుత్ కనెక్షన్, స్విచ్ బోర్డ్ సెట్ చేశాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.పైగా ఆ వ్యక్తి దీనికంటే బెస్ట్ కూలర్ మీరు ఎక్కడైనా కొనగలరా అని క్యాప్షన్లో రాశాడు.ఇతడి మేధస్సుకు హ్యాట్సాఫ్ అనాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube