తుపాకీ లైసెన్స్‌ ఇవ్వండి అంటూ పోలీసులకు‌ విజ్ఞప్తి చేస్తున్న యువతి.. ఎందుకంటే.. ?

దేశంలో ఆత్మ రక్షణ కోసం ప్రతి వారు ఆయుధం పడితే లోకం వల్లకాడు అవుతుంది.మరి ఇలాంటి చర్యలను ఆపవలసిన అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదట.

 Hathras Case Victim Woman Appealing To The Police To Give Her A Gun License-TeluguStop.com

కాగా ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన హత్రాస్‌ కేసులో నిందితుల నుంచి రక్షణ పొందేందుకు తుపాకీ కొనుగోలుకు లైసెన్స్‌ ఇవ్వాలని బాధిత కుటుంబానికి చెందిన యువతి పోలీసులకు విజ్ఞప్తి చేయడం సంచలనంగా మారింది.

ఈ మేరకు హత్రాస్‌ కేసులో ప్రధాన నిందితుడైన గౌరవ్‌ శర్మ నుంచి తమకు ప్రాణహాని ఉన్నదని, ఆయనను అరెస్ట్‌ చేయడంలో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తుండటంతో తమకు ప్రమాదం మరింత దగ్గరగా అవుతున్నదని పేర్కొంటూ, నిందితులను వెంటనే అదుపులోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆమె వినతిపత్రం పంపింది.

 Hathras Case Victim Woman Appealing To The Police To Give Her A Gun License-తుపాకీ లైసెన్స్‌ ఇవ్వండి అంటూ పోలీసులకు‌ విజ్ఞప్తి చేస్తున్న యువతి.. ఎందుకంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Demand, Gaurav Sharma, Gun License, Hathras Rape, Hathras Vicitms, Police, Self Protection-Latest News - Telugu

ఇకపోతే తమను తాము రక్షించుకునేందుకు తుపాకీ కొనుక్కోవడం ఒక్కటే శరణ్యమని నమ్ముతున్నామని, ఆత్మరక్షణార్దం తుపాకీకి లైసెన్స్‌ ఇప్పించాలని పోలీసులను కోరినట్లు బాధిత యువతి వెల్లడించారు.ఇక 2020 సెప్టెంబర్‌ 14 న హత్రాస్‌లో పశుగ్రాసం కోసం వెళ్లిన 19 ఏండ్ల యువతిని నలుగురు దుండగులు సమీపంలోని చేనులోకి లాక్కెళ్లి లైంగినదాడికి పాల్పడిన విషయం తెలిసిందే.కాగా ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ప్రధాన నిందితుడు గౌరవ్‌ శర్మను మాత్రం ఇంకా అరెస్ట్‌ చేయకపోవడం విశేషం.

#Hathras Rape #Gaurav Sharma #Hathras Vicitms #Demand #Self Protection

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు