అత్యాచారం చేసి చంపేస్తామంటూ షమీ భార్యకు బెదిరింపులు..!  

hasin jahan, cricketer mohammed shami, kolkota, ram mandhir, wishes, - Telugu Cricketer Mohammed Shami, Hasin Jahan, Kolkota, Ram Mandhir, Wishes

సోషల్ మీడియాలో తనకు ఎదురవుతున్న వేధింపుల గురించి భారత క్రికెటర్ మహ్మద్ షమీ భార్య మోడల్ హసీన్ జహాన్ అదివారం పోలీసులను ఆశ్రయించారు.ఆగస్టు 5వ తేదన అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

TeluguStop.com - Hasin Jahan Cricketer Mohammed Shami Kolkota Ram Mandhir

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్ షమీ భార్య, మోడల్ హసీన్ జహాన్ హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు.అయితే శుభాబినందనలు తెలిపినందుకు గాను కొంతమంది తనను వేధిస్తున్నారని హసీన్ జహాన్ కోల్‎కతా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

TeluguStop.com - అత్యాచారం చేసి చంపేస్తామంటూ షమీ భార్యకు బెదిరింపులు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కొందరు అత్యాచారం చేసి చంపేస్తాం అంటూ సోషల్ మీడియాలో అసభ్యకర రీతిలో కామెంట్లు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తనకు, తన కూతురికి రక్షణ కల్పించాలని హసీన్ జహాన్ కోరారు.

తాను నిస్సహాయురాలినై పోయానని, అభద్రతాభావం వెంటాడుతోందని పేర్కొన్నారు.ఇది ఇలాగే కొనసాగితే తాను మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మానవతా దృక్పథంతో సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని హసీన్ జహాన్ విజ్ఞప్తి చేశారు.అయితే గతంలో హసీన్ జహాన్ తన భర్త షమీ తనను హింసిస్తున్నాడని.

, చంపేందుకు ప్రయత్నించాడని సంచలన ఆరోపణలు చేశారు.దీంతో ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.

#Kolkota #Ram Mandhir #Hasin Jahan #Wishes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hasin Jahan Cricketer Mohammed Shami Kolkota Ram Mandhir Related Telugu News,Photos/Pics,Images..