సైబర్ అటాక్ ఏమైనా జరిగిందా..?! ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సోషల్ మీడియా..!

వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియా వాడకం చాలా మందికి బాగా అలవాటు అయింది.ముఖ్యంగా వాట్సాప్ పదినిమిషాలు రాకపోయినా ఏదో కోల్పోయినట్లు చాలామంది హైరానా పడుతుంటారు.

 Has There Been Any Cyber Attack Social Media Stalled Around The World Social Me-TeluguStop.com

తమకిష్టమైన వారితో మాట్లాడ లేకపోతున్నామని బాధ కూడా పడుతుంటారు.దీనిబట్టి వాట్సాప్ మన జీవితంలో ఎంత ముఖ్యమైన భాగం అయిందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి వాట్సాప్ సేవలు ఒక్కసారిగా గంటల తరబడి స్తంభించిపోతే.ఇంకేమైనా ఉందా? యూజర్లు తల్లడిల్లడం ఖాయం.సరిగ్గా నిన్న ఇదే జరిగింది.దాంతో చాలామంది తమకు మాత్రమే వాట్సాప్ రావట్లేదా? అసలు ఏమై ఉంటుంది? అని తెగ హైరానా పడ్డారు.కొందరు ఉన్నఫలంగా ట్విట్టర్ లోకి వచ్చి తమతో పాటు ఇతరులకు కూడా వాట్సాప్ రావట్లేదని తెలుసుకుని షాక్ అయ్యారు.

సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వాట్సాప్ తో సహా ఫేస్‌బుక్‌, ఇన్ స్టాగ్రామ్ సేవలు ఒక్క సారిగా ఆగిపోయాయి.

కొందరు ఇతర సోషల్ మీడియాలోకి వెళ్లి ఫిర్యాదు చేయగా.మరికొందరు Downdetector.com వెబ్ సైట్ ను ఆశ్రయించారు.

తమకు ఒక్కరికే వాట్సాప్ రావడం లేదా లేక అందరికీ వాట్సాప్ సేవలు నిలిచిపోయాయా అని 30 వేల మంది నిమిషాల వ్యవధిలోనే చెక్ చేశారు.ఈ క్రమంలో క్షమించాలి.మా వైపు ఏదో తప్పిదం జరిగింది.దాన్ని గుర్తించి ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం.ఈ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తాం’’ అని ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

Telugu Cyber Attack, Cyber Security, Detecter, Instgram, Whats-Latest News - Tel

మరోవైపు దీనిపై సెలబ్రిటీలు కూడా స్పందించారు.వాట్సాప్ తమకు కూడా రావడం లేదని సరదాగా ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు.సామాన్యులు మాత్రంసైబర్ అటాక్ ఏమైనా జరిగిందా? గంటల తరబడి వాట్సాప్ సేవలు నిలిచిపోవడం ఏంటని కంగారు పడ్డారు.ఇదిలా ఉండగా నిన్న రాత్రి ఆగిపోయిన వాట్సాప్ సేవలు ఈరోజు అనగా మంగళవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.దాంతో చాలామంది యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube