బీజేపీలో ఒకప్పటి నాయకుల ప్రాధాన్యత తగ్గినట్టేనా?

తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతోంది.ఒకప్పుడు బీజేపీ పార్టీ అనేది చాలా వరకు ఎవరికి తెలిసిన పరిస్థితి లేదు.

 Has The Prominence Of Former Leaders In The Bjp Diminished Telangana Politics, B-TeluguStop.com

బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ నియామకం తరువాత బీజేపీ ఒక్కసారిగా పుంజుకున్న విషయం తెలిసిందే.అయితే బీజేపీ అంతగా బలం లేనప్పుడు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా బీజేపీలోనే  కొనసాగిన వారందరికీ ప్రస్తుతం ప్రాధాన్యత ఇవ్వడం లేదనే వార్తలు ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది.

అయితే ఒకప్పుడు పార్టీని నమ్ముకొని ఉన్నవారిని వదిలేసి ఇప్పుడు ఇతర పార్టీల నుండి వచ్చిన వారి ప్రాబల్యం పెరిగిపోయిందని బీజేపీలో అంతర్గతంగా చర్చించుకుంటున్న అంశం.అయితే ఇది ఒక వర్గం వాదన అయితే పార్టీ బలపడుతున్న కొద్దీ చాలా మంది నేతలు వస్తూ ఉంటారని అందువల్ల పార్టీ కొరకు మొదటి నుండి కష్టపడుతున్న నాయకులకు కూడా ప్రాధాన్యత తగ్గించడం అనే మాట ఉండదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.

అంతేకాక ఇప్పటికే బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల కీలక నాయకుల నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఒక వేళ ప్రజల్లో  బలంగా తయారయితే టీఆర్ఎస్ కు కొద్ది స్థాయిలో పోటీ వచ్చే అవకాశం ఉంది.ప్రస్తుతం బీజేపీ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ  స్థానికంగా బీజేపీ బలపడడానికి ప్రయత్నం జరుగుతోంది.

Telugu Bandi Sanjay, Bjp, Etala Rajender, Huzurabad, Telangana, Trsy-Political

అయితే బీజేపీ మత రాజకీయాలను ఇప్పటికే ప్రారంభించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో బీజేపీ వ్యూహం కనుక సక్సెస్ అయితే బీజేపీ టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడానికి అవకాశం ఉంది.అయితే కెసీఆర్ వ్యూహాలను తట్టుకొని బీజేపీ ప్రజలను ఎంత వరకు ఆకట్టుకుంటుందనేది చూడాల్సి ఉంది.అంతేకాక త్వరలో రెండో దఫా ప్రజా సంగ్రామ యాత్ర మొదలు కానున్న నేపథ్యంలో  బీజేపీ బలపడడానికి మరింత అవకాశం ఉంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube