జ‌గ‌న్‌కు మ‌ళ్లీ ప్ర‌జాద‌ర‌ణ పెరిగిందా..?

2019 ఎన్నిక‌ల ఫలితాలు చూసిన త‌ర్వాత అస‌లు దేశంలోనే ఏ ముఖ్య‌మంత్రికి ద‌క్క‌నంత మెజార్టీ కేవ‌లం జ‌గ‌న్‌కే ద‌క్కింద‌ని అంతా అనుకున్నారు.ఇంకోవైపు ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ అయితే అప్ప‌ట్లో దేశ వ్యాప్తంగా చ‌ర్చీనీయాంశంగా మారింది.

 Has The Popularity Of Jagan Increased Again-TeluguStop.com

అయితే ఆ త‌ర్వాత క్ర‌మ క్ర‌మంగా కాస్తంత వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ప్ప‌టికీ కూడా ఇప్పుడు జ‌రిగిన స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌ను చూస్తే మాత్రం మ‌ళ్లీ జ‌గ‌న్ కు ప్రజాద‌ర‌న పెరిగిన‌ట్టు తెలుస్తోంది.ఇందుకు నిద‌ర్శ‌నంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయ‌న‌కు వ‌చ్చిన ఓట్ల శాతం కంటే కూడా ఇప్పుడు 17.66 శాతం ఎక్కువ‌గా పోల‌యిన‌ట్టు తెలుస్తోంది.

ఈ విష‌యాల‌ను స్వ‌యంగా వైసీపీ నేతలే చెబుతున్నారు.ఇక‌పోతే జ‌గ‌న్ ఈ రెండేళ్ల త‌న పాలనలో ఏపీలోని 67.61 శాతం మంది ప్రజల‌ను త‌న‌వైపు తిప్పుకున్నారని, వారంద‌రి ఆదరణ జ‌గ‌న్ కు ఉంద‌ని వెల్ల‌డిస్తున్నారు.ఇక గ‌త అసెంబ్లీ ఎన్నికల ఫలిత‌ల‌ను గ‌న‌క ఒక‌సారి చూస్తే గ‌త చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌గా ఏకంగా 49.9 శాతం ఓట్లు ప‌డ‌టంతో వైసీపీ తిరుగుల‌ని మెజార్టీ స్థానాల‌తో అధికారంలోకి వచ్చింది.కాగా అదంతా వైసీపీ సెంటిమెంట్ గేమ్ అడింద‌ని టీడీపీ నేతలు చెప్పినా ఇప్ప‌టి రూర‌ల్ ఏరియాలో జ‌రిగిన ఎన్నిక‌లు మ‌రోసారి ప్ర‌జ‌లు జగన్ వెంటే ఉన్నారిన నిరూపించారు.

 Has The Popularity Of Jagan Increased Again-జ‌గ‌న్‌కు మ‌ళ్లీ ప్ర‌జాద‌ర‌ణ పెరిగిందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక జగన్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన దాదాపు రెండేళ్ల త‌ర్వాత ఈ ఎన్నిక‌లు వ‌చ్చాయి.అయితే ఇందులో గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి దాదాపు 1,30,53,282 మంది ఓట్లు వేయ‌గా ఇందులో 67.61 శాతం ఓట్లను జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో వైసీపీ ద‌క్కించుకోవ‌డం పెద్ద సంచ‌ల‌నంగా మారింది.ఇక ప్ర‌తిప‌క్ష టీడీపీకి 22.79 శాతం ఓట్లు పోల‌వ‌డం పెద్ద మైన‌స్ గా మారింది.దాదాపుగా 1.30 కోట్ల మంది ప్ర‌జ‌లు జ‌గ‌న్‌నే విశ్వ‌సిస్తున్న‌ట్టు తేలింది.ఇక దీన్ని చూపించి వైసీసీ నేత‌లు చాలా ధీమాతో ఉన్నార‌ని తెలుస్తోంది.కాగా ఈ ఎఫెక్ట్ రాబోయే ఎన్నిక‌ల్లో కూడా బ‌లంగా ఉండ‌నుంది.

.

#AP #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు