స‌జ్జ‌ల కామెంట్స్ః కృష్ణా జ‌లాల వివాదంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెన‌క్కి తగ్గిందా..?

ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణ మ‌ధ్య‌లో మ‌ళ్లీ కృష్ణా జ‌లాల వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది.కృష్ణా న‌దిపై ఏపీ క‌డుతున్న ప్రాజెక్టుల విష‌యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 Has The Jagannath Government Backed Down On The Krishna Waters Dispute, Jagan,-TeluguStop.com

మొన్న జ‌రిగిన కేబినెట్ మీటింగ్‌లో ఏపీ క‌డుతున్న ప్రాజెక్టుల‌పై కేసీఆర్ ప్ర‌భుత్వం న్యాయ‌ప‌ర‌మైన పోరాటానికి సిద్ధ‌మైంది.అంతేకాదు ఏపీకి కౌంట‌ర్‌గా కృష్ణా జ‌లాల‌పై కొత్త ప్రాజెక్టుల‌కు క‌ట్టేందుకు రెడీ అవుతోంది.

ఇదిలా ఉండ‌గా టీఆర్ ఎస్ మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిపై, జ‌గ‌న్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

Telugu @ktrtrs, Sajjalarama-Telugu Political News

ఈ వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు తెలంగాణ‌, ఏపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల వార్ న‌డుస్తోంది.అయితే ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం వైసీపీ ఎమ్మెల్యేలు మాత్ర‌మే వీటిపై మాట్లాడారు.గానీ మంత్రులు లేదా జ‌గ‌న్ టీమ్ స‌భ్యులు ఎవ‌రూ దీనిపై మాట్లాడ‌లేదు.

కానీ తాజ‌గా జ‌గ‌న్ న‌మ్మిన బంటు అయిన ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉన్నాయి.కృష్ణా జ‌లాల ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జ‌గ‌న్ మాట‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోవాల్సి వ‌స్తే అందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారని చెప్పారు.

అంటే ఇన్ డైరెక్టుగా జ‌గ‌న్ చ‌ర్చ‌ల‌కు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పార‌న్న మాట‌.కేసీఆర్ తో వివాదం మంచిది కాద‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అది భ‌విష్య‌త్‌లో ఆయ‌న‌కు చేటు చేసే ఛాన్స్ ఉంది కాబ‌ట్టి కేసీఆర్‌తో వివాదం కంటే స్నేహ‌మే ముఖ్య‌మ‌ని జగన్ భావిస్తున్నారు.ఇరు రాష్ట్రాల మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క సంబంధాలు ఉండాల‌ని స‌జ్జ‌ల చెప్ప‌డం వెన‌క జ‌గ‌న్ ప్ర‌మేయం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్‌తో అనేక ర‌కాల వివాదాల‌పై చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్కారం చూపామ‌ని, ఇప్పుడు కూడా అలాగే ముందుకు వెళ్లాల‌ని చెప్ప‌డం వెన‌క జ‌గ‌న్ కాస్త త‌గ్గిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube