జనసేన చేతిలోంచి 'గాజు గ్లాస్' చేజారిపోయిందా..?!

జనసేన పార్టీకి ఏదీ కలిసి రావడం లేదు.బీజేపీతో స్నేహం కోసం గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో తెలంగాణలో జనసేన పార్టీ తన గుర్తు అయిన గాజు గ్లాస్‌ను కోల్పోయింది.

 Has The 'glass' Slipped From Janasena's Hand , Janasena, Pawan Kalyan, Glass, Vo-TeluguStop.com

సాగర్ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ఎవరికీ మద్దతు ప్రకటన చేయకండా జనసేన గడిపేసింది.అయితే తాజాగా వెలువడిన మినీ మున్సిపల్ ఎన్నిక సమరంలో అన్ని చోట్లా పోటీ చేయాలని నిర్ణయించుకుంది.

ఐదు మున్సిపాల్టీలతో పాటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు 30వ తేదీన జరగనున్నాయి.ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించుకుంది.

అందుకే ఉమ్మడి గుర్తును కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఓ విజ్ఞాపనా పత్రం పెట్టుకున్నారు.ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లలో అయినా పోటీ చేసి ఉంటే నిబంధనల ప్రకారం కామన్ గుర్తు కేటాయిస్తారు.

అయితే జనసేన పార్టీ ఇటీవలి గ్రేటర్ ఎన్నికల్లో పదిశాతం సీట్లలో పోటీ చేయలేదు.అసలు పోటీ చేయలేదు.

జనసేన ఎస్ఈసీకి వివరణ ఇచ్చింది.భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నందున పోటీ చేయలేకపోయామని ఈసారి అన్ని చోట్లా పోటీ చేస్తామని కామన్ గుర్తు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

అయితే జనసేన వివరణపై తెలంగాణ ఎస్ఈసీ సంతృప్తి చెందలేదు.కామన్‌గా గాజు గ్లాస్ గుర్తు కేటాయించేందుకు అంగీకరించలేదు.దీంతో ఆ గుర్తు స్వతంత్రులకు కేటాయించనున్నారు.జనసేన పార్టీ అభ్యర్థులు కూడా స్వతంత్రుల కిందనే వస్తారు కాబట్టి వారు నామినేషన్లు వేసిన దగ్గరల్లా తమకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని విజ్ఞప్తి చేసుకోవాల్సి ఉంటుంది.

నిబంధనలను బట్టి అధికారులు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తారు.ఇప్పటికైతే తెలంగాణలో గుర్తును కోల్పోయినట్లయింది.

ఏపీలో కూడా జనసేన పార్టీకి గుర్తు విషయంలో పక్కాగా ఉండకపోవడంతో తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేయకపోయినా వేరే పార్టీ అభ్యర్థికి ఆ గుర్తును ఈసీ కేటాయించింది.దీంతో జనసేన వర్గాలకు షాక్ తగిలినట్లయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube