ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్‌కు మ‌ధ్య దూరం పెరిగిందా..?

Has The Distance Between The Mlas To Jagan Increased

ప్ర‌తి పార్టీ కూడా ఓ సాంప్ర‌దాయం ప్ర‌కారం ప‌నిచేయాలి.ఓ క‌మిట్ మెంట్ , అండ‌ర్‌స్టాండ్ మెంట్ అనేది అన్ని పార్టీల‌కు చాలా ముఖ్యం.

 Has The Distance Between The Mlas To Jagan Increased-TeluguStop.com

అధినాయ‌కుడికి పార్టీ నేత‌ల‌కు మ‌ధ్య గ్యాప్ అనేది రాకూడ‌దు.నిత్యం వారితో అధినేత మ‌మేకం అవుతూనే ఉండాలి.

అప్పుడు వారి అంత‌రంగాలు అనేవి ఆయ‌న‌కు తెలుస్తాయి.లేక‌పోతే మాత్రం చాలా క‌ష్టం.

 Has The Distance Between The Mlas To Jagan Increased-ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్‌కు మ‌ధ్య దూరం పెరిగిందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక అధికారంలో ఉన్న పార్టీలో అయితే ఆ పార్టీ త‌ర‌ఫున ఉన్న ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య ఎంతో అవినాభావ సం బంధాలు అనేవి క‌చ్చ‌తంగా ఉండాలి.అప్పుడే అభివృద్ధి జ‌రుగుతుంది.

లేదంటే మాత్రం ఇంక అంతే సంగ‌తి అని చెప్పాలి.ప్రభుత్వం ఏ నిర్ణ‌యం తీసుకున్నా ఆ విధి, విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేది మాత్రం ఎమ్మెల్యేలు మాత్ర‌మే.అయితే ఈ విష‌యంలో జ‌గ‌న్ కాస్త వెన‌క‌బ‌డిన‌ట్టు తెలుస్తోంది.ఆయ‌న ఎమ్మెల్యేల‌ను చాలా కాలంగా దూరం పెడుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ త‌రుణంలోనే మొన్న‌నేషనల్ సర్వే సంస్థ‌ల ఎంక్వ‌యిరీలోనూ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలపై వారికి ఓట్లేసిన ప‌బ్లిక్ చాలా కోపంగా ఉన్నార‌ని తెలిసింది.దీంతో ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదనను తెలుపుతున్నారు.

Telugu Ap News, Ap Politics, Has The Distance Between The Mlas, Jagan, Ycp Mla\\'s, Ysrcp-Telugu Political News

జ‌గ‌న్ త‌మ విన్న‌పాల‌ను వినిపించుకునే అవ‌కాశం త‌మ‌కు ఇవ్వ‌ట్లేద‌ని వాపోతున్నారు.జ‌గ‌న్ ఆదేశం లేకుండా తాము ఏ ప‌నిచేయలేని ప‌రిస్థితి ఉంద‌ని, పార్టీని ప్ర‌భుత్వాన్ని కొంద‌రు మాత్ర‌మే చేతుల్లో పెట్టుకున్నార‌ని జ‌గ‌న్ అపాయింట్ మెంట్ కూడా త‌మ‌కు దొర‌క‌ట్లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోని గ్రామాల్లో ఎలాంటి ప‌నులు చేయించాల‌న్నా కూడా త‌మ ద‌గ్గ‌ర నిధులు లేవ‌ని ఇందుకే త‌మ మీద ప్రజలకు వ్య‌తిరేక‌త వ‌స్తోంద‌ని చెబుతున్నారు.నిధుల కోసం జ‌గ‌న్‌ను క‌లుద్దామంటూ ఆయ‌న క‌లువ‌ట్లేదంటున్నారు.

ఈ గ్యాప్ వైసీపీకి పెద్ద న‌ష్ట‌మ‌నే విశ్లేష‌కులు భావిస్తున్నారు.మ‌రి ఇక‌నైనా జ‌గ‌న్ దీనిపై దృష్టిపెడుతారో లేదో.

#AP #AP #Jagan #Ysrcp #YCP MLAS

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube