సచిన్ ఫైలట్ రాజీకి వచ్చారా ? సీఎంతో నేడు సమావేశం !

రాజస్థాన్ రాజకీయాల్లో వాడీవేడీ తగ్గినట్లు కనిపిస్తోంది.మొన్నటివరకూ బలపరీక్ష నిరూపణ కోసం పోటీ పడిన సచిన్ పైలట్, సీఎం అశోక్ గెహ్లాట్ రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది.

 Rajasthan,cm, Sachin Pilot , Sachin Pilot Meeting With Cm, Ashok Gehlot-TeluguStop.com

రాజకీయ సంక్షోభానికి తెరదించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించడంతో వీరిద్దరూ కలవబోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.కానీ, మాటల యుద్ధంతో ఇన్ని రోజులు వాడీవేడీగా సాగిన తిరుగుబాటు తర్వాత సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఈ రోజు శాసనసభలో సమావేశం కానున్నారు.

రాజీ కుదిరితే ఈ నెల 14న రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం అవుతాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

గత కొన్ని నెలలుగా రాజస్థాన్ రాజకీయాలు ఉత్కంఠాన్ని నెలకొల్పాయి.

సచిన్ పైలట్ వర్గం తిరుగుబాటుతో అశోక్ గెహ్లాట్ బలపరీక్షకు సిద్ధమయ్యారు.బల నిరూపణలో గెలుస్తారా? లేదా అని రాజస్థాన్ రాజకీయాలు వాడీవేడీగా జరిగాయి.బల నిరూపణకు సిద్ధమైనా కాంగ్రెస్ అధిస్థానం కలగజేసుకోవడంతో వీరిద్దరు ఒక్కటయ్యరనే చెప్పవచ్చు.కానీ సీఎం అశోక్ గెహ్లాట్ బలపరీక్షకే మొగ్గు చూపుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.దీనిపై తుది నిర్ణయం రావాలి అనుకుంటే రేపటి (14వ తేదీ) వరకు వేచి ఉండాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube