ఈటల విషయంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారా... బీజేపీలో ఈటల పరిస్థితేంటి?

గతేడాది టీఆర్ఎస్ అధినేతతో విభేదించి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ కండువాను కప్పుకున్నారు.టీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేసి మరలా ఎన్నికల్లో పోటీ చేశారు.

 Has Kcr Been Successful In The Matter Of Etela What Is The Situation Of Etala In-TeluguStop.com

తద్వారా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది.ఈ ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు టీఆర్ఎస్ పార్టీ గట్టిగానే ప్రయత్నించింది.

కానీ చివరికి మాత్రం ఈటల గెలుపును అడ్డుకోలేకపోయింది.అక్కడ ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు.

ఈ ఉప ఎన్నికలు రాష్ట్రమంతా హాట్ టాపిక్ అయ్యాయి.ఎంత మంది మంత్రులను టీఆర్ఎస్ రంగంలోకి దించినా కానీ ఈటల రాజేందర్ వారందరినీ తట్టుకుని గెలిచి సత్తా చాటారు.

ఇక ఈ గెలుపుతో ఆయన బీజేపీలో ఓ వెలుగు వెలిగిపోవడం ఖాయం అని అనుకుంటే అలా జరగడం లేదు.ఇంతకీ అసలు బీజేపీలో ఏం జరుగుతోంది అంటే…

కేసీఆర్ రాజకీయ చతురత తెలిసిన వారెవరైనా ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు.

ఎందుకంటే కేసీఆర్ ప్లాన్లు అలా ఉంటాయని అందరికీ తెలుసు.ఈటల విషయంలో కూడా కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అయిందని ఆయన విజయం సాధించారని పలువురు చెబుతున్నారు.

కేసీఆర్ ను కాదని బయటకు వెళ్లిన ఈటలకు రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు.ఇప్పుడు టీఆర్ఎస్ ఆడుతున్న గేమ్ తో ఫోకస్ మొత్తం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అని కాకుండా టీఆర్ఎస్ వర్సెస్ బండి సంజయ్ అనే విధంగా మారిపోయింది.ఈ పరిణామాల వలన ఈటల రాజేందర్ చాలా వెనుకబడిపోయారు.మరి చూడాలి భవిష్యత్ లో ఈటల రాజేందర్ పరిస్థితి టీఆర్ఎస్ లో ఎలా ఉంటుందో… ఆయన హవా నడుస్తుందో లేదో.

KCR Political Strategy Against Etela Rajender #Telangana

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube