టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
బాహుబలి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకుడు రాజమౌళి.అంతే కాకుండా రాజమౌళి ఏ సినిమా దర్శకత్వం వహించినా కూడా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
అలాగే రాజమౌళి వల్ల తెలుగు సినిమా ఖ్యాతి పెరగడమే కాకుండా ప్రతి ఒక చిన్న సినిమా కూడా రికార్డు స్థాయిలో మార్కెట్ ను సంపాదించుకుంటోంది.దీంతో ప్రతి ఒక్కరు కూడా లాభాల బాట పడుతున్నారు.
ఇది ఇలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా ఇటీవలే విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
అయితే ఈ సినిమా విజయం రాజమౌళి డ్రీమ్ కు మరింత బలాన్ని ఇచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా రాజమౌళి మాట్లాడిన మాటల్లో కూడా ఇదే స్పష్టంగా వినిపిస్తోంది.
బాహుబలి సినిమా తరువాత మీడియాతో ముచ్చటించిన రాజమౌళి మహాభారతం సినిమాని తెరపైకి తీసుకురావాలి అన్నది తన డ్రీమ్ అనీ అంతేకాకుండా తన కెరీర్ లో చివరి ప్రాజెక్టు అవుతుందని కూడా సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఒక మీడియాతో ముచ్చటైన రాజమౌళి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.పౌరాణిక సినిమాల నిజమైన సామర్ధ్యాన్ని మన దర్శక నిర్మాతలు గ్రహించారు.ఇక రాబోయే రోజుల్లో పౌరాణిక టచ్ నేపథ్యంలోనే చాలా సినిమాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను.
అలాంటి సినిమాలకు చాలా స్కోప్ ఉంది.ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు పౌరాణిక చిత్రాలను రూపొందించే ఆలోచనలో చురుగ్గా అన్వేషిస్తున్నారు అని చెప్పుకొచ్చారు రాజమౌళి.
ఇకపోతే కార్తికేయ 2 సినిమా ఉత్తరాది తో పాటు దక్షిణాదిలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకొని వసూళ్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.