అంతర్మధనంలో భాగంగానే కాంగ్రెస్ సైలెంట్ గా మారిందా ?

తెలంగాణలో కాంగ్రెస్ రోజురోజుకు బలహీనపడుతోంది.కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సమర్తులైన సీనియర్లు ఉన్నా అంతర్గత కలహాల వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పలుచబడింది.

 Has Congress Become Silent As Part Of The Infighting ,  Telangana Congress, Utta-TeluguStop.com

అందుకు నిదర్శనమే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి అనేదని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.అయితే పోటీ చేస్తున్న ప్రతీ ఎన్నికలలో కూడా ఓడిపోతుండడంతో కాంగ్రెస్ వైపు చూసిన ప్రజలు కూడా బీజేపీ వైపు దృష్టి సారించారని చెప్పవచ్చు.

అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబెట్టిన ఇద్దరు అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములు నాయక్ ఓడిపోవడంతో ఇక కాంగ్రెస్ పట్ల పట్టభద్రులు కూడా నమ్మకంగా లేరని అర్థమవుతోంది.అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో ఢీలా పడిన కాంగ్రెస్ నేతలు సైలెంట్ గా ఉన్నారనే విషయం అర్థమవుతోంది.

అయితే ఈ నిశ్శబ్దం వెనుక పెద్ద తుఫాను ఉందా లేక అసలు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఎందుకు నమ్మకం చూపించడం లేదనే విషయం అంతర్మధనం చేస్తున్నారా అనేటటు మవంటిది తెలియాల్సి ఉంది.అయితే రేవంత్ కూడా తనకు లభించాల్సినంత ప్రోత్సాహం కాంగ్రెస్ లో లభించడం లేదని భావిస్తున్న రేవంత్ వేరే ఆలోచనల్లో ఉంటున్నట్లు తెలుస్తోంది.

అయితే రేవంత్ తప్ప మిగతా వారెవరూ ప్రజల్లో తిరిగి కాంగ్రెస్ ను గాడిన పెట్టేంతలా ఎవరూ లేకపోవడంతో రేవంత్ పట్ల అధిష్టానం ఆచితూచి వ్యవహారిస్తున్నట్టు సమాచారం.చూద్దాం భవిష్యత్తు కాంగ్రెస్ అనేది ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube