ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా సరికొత్త పధకం ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే పాల ప్యాకెట్ ఫ్రీ

ప్లాస్టిక్ భూతం కు వ్యతిరేకంగా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తోచిన చర్యలకు పాల్పడుతున్నారు.ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.

 Haryana Municipal Corporation Giving Plastic Exchange Offer-TeluguStop.com

ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాటిని సేకరించి రీసైక్లింగ్ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు వినూత్నంగా కార్యక్రమాలు చేపట్టారు.

తాజాగా హర్యానా లో ని పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ ఒక సరికొత్త పధకాన్ని ప్రవేశపెట్టింది.

‘‘ప్లాస్టిక్ తెచ్చివ్వండి.

పాలు తీసుకెళ్లండి’’ అంటూ ఓ నినాదాన్ని ప్రచారం చేసింది.కేజీ ప్లాస్టిక్ కానీ, పది ప్లాస్టిక్ బాటిల్స్ కానీ తెచ్చిస్తే ఒక ప్యాకెట్ పాలు ఇస్తామని ప్రకటించింది.

పంచకులలోని ప్రతి వీటా పాల బూత్‌లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని మున్సిపల్ అధికారి ఒకరు తెలిపారు.

ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Telugu Milk Pocket, Haryana, Panchkula-

హైదరాబాద్‌కు చెందిన ఓ కార్పొరేటర్.ప్లాస్టిక్ ఇస్తే… బియ్యం ఇస్తానంటూ గతంలో ప్రకటించి అందరి దృష్టినీ ఆకర్షించారు.ఈ తరహాలోనే దేశంలో పలు చోట్ల ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఒక్కొక్కరూ ఒక్కోలా ఆచరణీయ కార్యక్రమాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube