మీకు తెలుసా : ప్రవేట్ స్కూళ్లల్లో ఆ క్లాసులు రద్దు  

Haryana Government Orders Private School To Stop Kindergarten Classes-

ఇప్పుడు ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలలే దర్శనం ఇస్తున్నాయి.ఇబ్బడిముబ్బడిగా ప్రవేటు స్కూళ్లను ఏర్పాటు చేస్తూ, కనీస సౌకర్యాలు, నిబంధనలు పాటించకుండా అనేక పాఠశాలలో కనిపిస్తున్నాయి.

Haryana Government Orders Private School To Stop Kindergarten Classes- Telugu Viral News Haryana Government Orders Private School To Stop Kindergarten Classes--Haryana Government Orders Private School To Stop Kindergarten Classes-

ప్రభుత్వ పాఠశాలలు ఊరికి ఒకటి ఉంటే ప్రవేటు పాఠశాలలు మాత్రం ఊరికి నాలుగైదు ఉంటున్నాయి.అయితే ప్రభుత్వ పాఠశాలల మధ్య పెరిగిన పోటీ కారణంగా రెండున్నరేళ్ల పిల్లలను కూడా పాఠశాలల్లో జాయిన్ చేసేలా యాజమాన్యాలు తల్లి తండ్రులను కౌన్సలింగ్ చేస్తుండడంతో వారుకూడా ఒప్పుకుంటున్నారు.

నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పేరుతో క్లాసులు నిర్వహిస్తూ ఏమీ తెలియని పిల్లలకు కూడా అక్షరాలు దిద్దించేస్తున్నారు.అయితే ఇక నుంచి ఆ విధంగా చేయడానికి వీల్లేదంటూ ప్రైవేట్ విద్యాసంస్థలపై హర్యానా ప్రభుత్వం గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Haryana Government Orders Private School To Stop Kindergarten Classes- Telugu Viral News Haryana Government Orders Private School To Stop Kindergarten Classes--Haryana Government Orders Private School To Stop Kindergarten Classes-

ఆడి పడాల్సిన వయసులో చిన్న పిల్లలను ఇలా చదువు పేరుతో బంధించి వారి స్వేచ్ఛను హరించడం సరికాదంటూ అక్కడి ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.అందుకే ఐదేళ్ల తర్వాత మాత్రమే పిల్లలను బడిలో జాయిన్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

పిల్లలు ఆడుకోవడానికి మానసికంగా ఎదిగేందుకు తగిన సమయం కావాలని, దానిని దృష్టిలో పెట్టుకుని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కింది స్థాయి తరగతులను రద్దు చేసినట్టు తెలుస్తోంది.అయితే ఈ విధాన్ని మిగతా రాష్ట్రాలు కూడా పాటించే అవకాశం కనిపిస్తోంది.

తాజా వార్తలు