యువకుడిని నెట్టేసిన హర్యానా సి ఎం ఖట్టర్

Haryana Chief Minister Pushied A Young Man

ఒక యువకుడి పై హర్యానా సి ఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేయి చేసుకున్నారు.సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన ఒక యువ కార్యకర్త పై సి ఎం ఖట్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నారు.

 Haryana Chief Minister Pushied A Young Man-TeluguStop.com

హర్యానా లోని కర్నాల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఒక కార్యక్రమం నిమిత్తం ఖట్టర్ కర్నాల్ వెళ్లారు.

ఈ సందర్భంగా అక్కడకు పలువురు కార్యకర్తలు కూడా హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఒక యువకుడు సి ఎం పాదాలను తాకి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించడం తో ఆ యువకుడిని అడ్డుకొని నెట్టివేశారు.

అయితే ఆ యువకుడి ని పక్కకు తోసేసిన ఖట్టర్ ఏమి జరగనట్లు గా ముందుకు వెళ్లిపోయారు.ఖట్టర్ ఈ విధంగా ప్రవర్తించడం ఇదే తొలిసారి ఏమీ కాదు గతంలో కూడా ఇద్దరు వృద్ధ దంపతులు తమకు జరిగిన అన్యాయం విన్నవించాలి అని ఖట్టర్ వద్దకు రాగా ఆ సమయంలో వారిపై దురుసు గా ప్రవర్తించి వార్తలలో నిలిచారు.

అంతేకాకుండా ఆయన పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని ప్రశ్నించిన ఓ పాత్రికేయుడిని ఆయన నోటికొచ్చినట్లు తిట్టారు.

ప్రభుత్వం వైపు వేలెత్తి చూపడం మీడియా పనికాదని, సమాచారం మాత్రమే సేకరించాలని, హద్దుల్లో ఉండకపోతే ఇబ్బందులు ఎదుర్కుంటారంటూ నోటికి పనిచెప్పారు.తర్వాత మీడియా, ప్రతిపక్షాలనుంచి వ్యతిరేకత రావడంతో క్షమాపణలు చెప్పారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube