“తెలంగాణా ప్రొఫెసర్”...కి అమెరికా యూనివర్సిటీ ఆహ్వానం..!!!

ప్రతిభ ఎక్కడ దాగున్నా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, ప్రతిభకి తగ్గ గౌరవం కూడా వెతుక్కుంటూనే వస్తుంది.అలాంటి సంఘటనలు విదేశాలలో స్థిరపడిన భారత ఎన్నారైలకి అనుభవం అవుతూనే ఉంటాయి.

 Harvard University Welcomes-TeluguStop.com

అయితే తాజాగా అమెరికాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్‌ యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న ఓ విశ్రాంత ప్రొఫెసర్ కి తమ యూనివర్సిటీ రావాల్సిందిగా ఆహ్వానం పంపింది.

ఉస్మానియా యూనివర్సిటీలో విశ్రాంత ప్రొఫెసర్‌, ప్రస్తుతం జైళ్ళ శాఖ మంత్రి ఉన్నతి కార్యక్రమ ఇన్‌చార్జి డా.బీనా చింతలూరికి ప్రతిభకి హార్వర్డ్ యూనివర్సిటీ పట్టం కట్టింది.ఖైదీల్లో మానకికంగా మార్పు తీసుకురావడంతో పాటు నేరాల శాతం తగ్గించడం అనే అంశంపై మాట్లాడవలసిందిగా ఆమెకి ఆహ్వనం పంపారు.

ఈ మేరకు ఆమె ఈ అంశంపై మాట్లాడనున్నారని తెలంగాణ జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు.ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.ఇక్కడి జైళ్లలో అమలవుతున్న సంస్కరణలు దేశ విదేశాలకి చేరుతున్నాయని ఆయన అన్నారు.అందుకు నిదర్సనమే ఈ ఆహ్వనమని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube